కొవ్వూరు : గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 75 వ రోజు కొవ్వూరు
మండలంలో హోంమంత్రి డా.తానేటి వనిత పర్యటించారు. కొవ్వూరు లోని 15 వార్డు లో
ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి లబ్దిదారులకు వివరించారు.
సీఎం జగన్ తమ అర్హతను గుర్తించి సంక్షేమ పథకాలను అందిస్తున్నారని లబ్ధిదారులు
ఆనందం వ్యక్తంచేశారు. ప్రతి కుటుంబానికి అమ్మఒడి , చేయూత, రైతు భరోసా, ఆసరా,
పెన్షన్ వంటి నాలుగయిదు పథకాలు అందుతున్నాయని హోంమంత్రి తానేటి వనిత
పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ కు అర్హత పొందాలన్నా, పెన్షన్
తీసుకోవాలన్న వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడేవాళ్లని గుర్తుచేశారు. కానీ సీఎం
జగన్ అధికారం లోకి వచ్చాక వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి లబ్ధిదారుల ఇంటి
వద్దకే పెన్షన్ అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకొని
సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం జగన్ కి హోం మినిస్టర్ వనిత ప్రత్యేక
కృతజ్ఞతలు తెలిపారు.