అమరావతి : టీడీపీ నిర్వహిస్తున్న ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని
వేగవంతం చేయాలని పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
కార్యక్రమ నిర్వహణపై క్లస్టర్ ఇంచార్జ్ లు, నియోజకవర్గ ఇంచార్జ్ లతో చంద్రబాబు
నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి ఇదేం ఖర్మ
కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి చేయాల్సి ఉన్నందున అందుకు అనుగుణంగా
ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. పార్టీ నిర్వహిస్తున్న ఇదేం ఖర్మ మన
రాష్ట్రానికి కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని చంద్రబాబు
అన్నారు. ప్రజలను చైతన్య వంతులను చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని
చంద్రబాబు అన్నారు.