బాలీవుడ్ నటి కృతి సనన్ సినిమా రంగంలో మంచి విజయాలతో రాణిస్తోంది. ఆమె ఇటీవల
జాతీయ ఉత్తమ నటి పురస్కారం గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఆ ఆనందాన్ని ఓ
ఇంటర్వ్యూలో పంచుకుంది కృతి. “నేను ఆ రోజు సాయంత్రం ఓ మీటింగ్ లో ఉన్నాను.
ఉన్నట్టుండి కాల్స్ రావడం మొదలైయ్యాయి. ఏం జరుగుతుందో నాకు అర్థం. కాలేదు.
సాధారణంగా మీటింగ్ సమయాల్లో నేను ఫోన్ వాడను. అంతలా కాల్స్ రావడంతో మీటింగ్
మధ్యలో బయటికి వచ్చి కాల్ ఆన్సర్ చేసి నేనందుకున్న విజయం గురించి విన్నాను. ఆ
సమయంలో అంత శూన్యంలా అనిపించింది. జీవితంలో అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న
సంతోషాన్ని “నా తల్లిదండ్రులతో పంచుకుందామని వారి దగ్గరికి వెళ్లాను” అంటూ తన
ఆనంద క్షణాలను గుర్తు చేసుకుంది. మా ఇంట్లో న్యూ ఇయర్ అయినా లేదా ఏ వేడుకైనా
పిజ్జాతో మొదలవుతుంది. ఆ రోజు నా గెలుపు గురించి తెలిసిన తర్వాత కూడా మా అమ్మ
కొన్ని పిజ్జాలు ఆర్డర్ చేద్దాం అని అన్నారు. ఆ మధురమైన క్షణాన్ని పిజ్జాతో
సెలబ్రేట్ చేసుకున్నాము అంటూ చెప్పుకొచ్చింది. అభిమానులకు, దేవుడికి కృతజ్ఞతలు
తెలుపుతూ…నేను పడిన కష్టానికి, చేసిన ప్రార్ధనలకు ప్రతిఫలం దక్కింది. నా
జీవితం, నా కలలు, నా లక్ష్యాల గురించి డైరీలో రాసి పెట్టుకుంటాను. ‘మిమీ’లో
పనిచేసిన తర్వాత ఆ సినిమాలో నా నటనకు జాతీయ అవార్డు వస్తుందని డైరీలో
రాసుకున్నాను. అనుకున్నట్టుగానే గెలిచాను అంటూ చెప్పుకొచ్చింది కృతి.