అమరావతి : హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా పోస్టల్ అధికారులు బిజెపి
రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో
కలిసారు. ఈ సందర్భంగా పోస్ట్ ల్ శాఖ అధికారుల నుద్దేశించి మాట్లాడుతూ
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆనాటి పోరాటాలను గుర్తు
చేసుకోవలసిన భాద్యత నేటి యువత పై ఉందన్నారు. పోస్టల్ శాఖ దేశ వ్యాప్తంగా హరఘర్
తిరంగా కార్యక్రమం చేపట్టి ప్రతి ఇంటి పై త్రివర్ణ పతాకం ఎగురువేశే భాద్యత
తీసుకోవడం అంభినందనీయం అన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా తపాలా శాఖ
జాతీయ స్ధాయిలో ఇంటింటికి త్రివర్ణ పతాకాన్ని అందించడంతో పాటు ప్రముఖలను
స్వయంగా కలసి జాతీయ పతాకాన్ని అందించి స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు
తెలియచేసే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటిమీద త్రివర్ణపతాకం
ఎగురవేయాలన్న సంకల్పంతో పోస్టల్ శాఖ ఈకార్యక్రమాన్ని వేగవంతం చేస్తోంది.
బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ని విజయవాడ అసిస్టంట్
పోస్ట్ మాస్టర్ జనరల్ కె సుధీర్ బాబు, తపాలా శాఖ సహాయ సంచాలకులు ఎం హరిప్రసాద
శర్మ, ప్రధాన తపాలా కార్యాలయ అధికారి ఎం తిరుమల రావు లు కలసి హరఘర్ తిరంగా
కార్యక్రమం రాష్ట్రం లో తపాలా శాఖ ఏవిధంగా నిర్వహిస్తున్నదీ కార్యక్రమం
వివరాలు వివరించారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి
పురందేశ్వరి అధికారులతో మాట్లాడుతూ ప్రతి ఇంటికి త్రివర్ణ పతాకం
రెపరెపలాడాలన్నారు. హరఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తపాలాశాఖ
అధికారులను ఆమె అభినందించారు. భవిష్యత్ తరాలకు స్వాతంత్ర్యపోరాట వివరాలు
తెలియ చేల్సిన భాద్యత కూడా ఉందన్న విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.