తణుకు : తణుకు మండలం దువ్వ గ్రామంలో జగనన్న కాలనిలో కోలపల్లి ఉమా శిరీష
శివప్రసాద్ దంపతులు నూతనంగా నిర్మించుకున్న గృహ ప్రవేశ కార్యక్రమంలో రాష్ట్ర
హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత ముఖ్యఅతిథిగా
పాల్గొన్నారు. గురువారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట
నాగేశ్వరావు తో కలిసి హోంమంత్రి పాల్గొని ప్రారంభించారు. జగనన్న కాలనీలో అన్ని
వసతులతో ఇంటిని సమకూర్చుకున్నామని లబ్దిదారులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
అనంతరం హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ ప్రతి పేదవాని సొంత ఇంటి కల సీఎం
జగన్ మోహన్ రెడ్డి ద్వారా మాత్రమే సాధ్యమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు
లేని నిరుపేదలకు ఇంటిని ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. మహిళల పేరిట ఇంటి
పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇల్లు నిర్మించుకోవడానికి తగిన ఆర్థిక సహాయం ఉచితంగా
జగనన్న ప్రభుత్వమే అందిస్తుందన్నారు.

దువ్వ జగనన్న కాలనీలో మొత్తం 731 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చామని వాటిలో
600కి పైగా ఇల్లు ఇప్పటికే పూర్తయ్యాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి
కారుమూరి నాగేశ్వరరావు హోంమంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అడ్డా
సూర్య నారాయణ మూర్తి (బాబు), సొసైటీ ప్రెసిడెంట్ జంపన వెంకటకృష్ణరాజు, తణుకు
ఎంపీపీ రుద్ర ధనరాజు, కోలపల్లి సూర్యారావు, నాయకులు పాల్గొన్నారు.