*జిమ్ కు వెళ్లేందుకు ఇష్టపడే వారు వాకింగ్, రన్నింగ్ లాంటి వాటికి మాత్రం
చేయడం లేదు.
*అంతే కాకుండా ప్రతి చిన్న పనికి నడవడానికి బదులుగా బైక్, కారును
ఉపయోగిస్తున్నారు.
*మంచి ఆరోగ్యం కోసం మీరు ప్రతిరోజూ ఉదయం 20 నుంచి 30 నిమిషాలు నడవాలి.
*నడక ఒక గొప్ప వ్యాయామం.
*చాలా మంది ఆరోగ్య నిపుణులు ప్రతిరోజూ 5 వేల అడుగులు నడవాలని సూచిస్తూ ఉంటారు.
*ఆరోగ్యంపై అవగాహన ఉన్నవారు మార్నింగ్ లేవగానే వాకింగ్ కు వెళతారు.
దీని వలన కలిగే ప్రయోజనాలు:
1. స్టామినా పెరుగుతుంది:
రోజూ అరగంట పాటు మార్నింగ్ వాక్ చేస్తే ఊపిరితిత్తుల కెపాసిటీ పెరిగి ఆ
తర్వాత ఆక్సిజన్ ను ఎక్కువగా తీసుకోవడం మొదలుపెడతారు.
ఈ రకమైన శ్వాసక్రియతో, మీ సత్తువ చాలా పెరుగుతుంది. ఆ తర్వాత మీరు మెట్లు
ఎక్కడం, వేగంగా పరుగెత్తడం, భారీ వ్యాయామాలు చేయడం వంటి చాలా కష్టమైన పనులను
చేయడంలో ఇబ్బంది కలగదు.
2. బరువు తగ్గించడంలో సహాయపడుతుంది .
ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఊబకాయంతో బాధపడుతున్నారు.
చాలా మంది శారీరక శ్రమను తగ్గించారు.
కాబట్టి పొట్ట, నడుము భాగంలో కొవ్వు చేరుతూ వస్తోంది.
ఒక్కసారి చేరిన కొవ్వును కరిగించడం అంత సులభమైన విషయం అయితే కాదు.
దీన్ని నివారించడానికి మీరు ప్రతిరోజూ ఉదయం నడకకు సమయం కేటాయించాలి.
ఇది ఊబకాయాన్ని తగ్గిస్తుంది. అధిక కొలెస్ట్రాల్, మధుమేహం వంటి తీవ్రమైన
వ్యాధుల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.
3. గుండె జబ్బుల నివారణ:
క్రమం తప్పకుండా మార్నింగ్ వాక్ చేసే వ్యక్తులు గుండెపోటు, ప్రమాదాలకు దూరంగా
ఉంటారు.
మార్నింగ్ నడక రక్తంలో నిల్వ ఉన్న కొవ్వును తగ్గిస్తుంది.
రక్త నాళాల్లో పేర్కొన్న కొవ్వును తగ్గించడంతో రక్త సరఫరాకు ఎటుంటి ఆటంకం
ఉండుదు. దాంతో మార్నింగ్ వాక్ చేసే వారిలో గుండె సంబంధిత సమస్యలు పెద్దగా
ఉండవు.