రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు
తణుకు : రాష్ట్రంలో ప్రతీ కుటుంబానికి లబ్ధి చేకూరిందంటే అది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అలోచనే అని రాష్ట్ర పౌరసరఫరాల, శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. మంగళవారం తణుకు నియోజకవర్గం ఇరగవరం మండలం నుంచి మంత్రి కారుమూరి చేపట్టిన ప్రజా దీవెన పాదయాత్ర 9వ రోజు పూర్తయింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనలో అందించిన సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ పాదయాత్రలో గ్రామస్తులు నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు.
సంక్షేమ పథకాలను అర్హులందరికీ వారికి నేరుగా బ్యాంకు ఖాతాల్లోకే జమ చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని పట్ల ప్రతి కుటుంబం తమ కుటుంబం సభ్యునిగా భావించి అండగా నిలవాలని మంత్రి కోరారు. సంక్షేమ పథకాలతో లబ్ది పొందిన వారు ఆనందం వ్యక్తం చేస్తూ ఏ గడపకు వెళ్ళినా అపూర్వ స్వాగతం పలుకుతున్నారని చెప్పారు. ప్రభుత్వం ప్రతి గ్రామంలో కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసినట్లు చెప్పారు. గత టీడీపీ పాలనలో గ్రామంలో లక్షల్లో కూడా ఖర్చు చేయలేదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్సీపీ ఘన విజయం సాధిస్తుందని చెప్పారు. ప్రజలందరికీ మేలు జరగడంతోనే ప్రజలంతా అండగా ఉన్నారని చెప్పారు. మీకు, మీ కుటుంబానికి ఈ ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాల వలన మేలు జరిగితేనే ఓటు వేయాలని ధైర్యంగా అడిగే నాయకుడు వైఎస్ జగన్ అని అన్నారు. టీడీపీ హయాంలో దోచుకో, దాచుకో, పంచుకో అనే విధంగా వాళ్ల పాలన ఉండేదని, ఏమాత్రం అభివృద్ధి జరగలేదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో అర్హతే ప్రామాణికంగా పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. మంగళవారం ఇరగవరం మండలం రేలంగి, ఎర్రయ్య చెరువు, గొల్లగుంట, వెండ్రవారి పాలెం, గుబ్బలవారి పాలెం, గొల్లమాల పల్లి, పిల్లివారి పాలెం, చిన రామునిలు చెరువు, హనుమాజి పాలెం గ్రామాల్లో పాదయాత్ర నేటికి ముగిసింది..
ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఇరగవరం మండలం పార్టీ అధ్యక్షులు కొప్పిశెట్టి దుర్గా ప్రసాద్, ఇరగవరం ఎంపీటీసీ కొప్పిశెట్టి మంగతాయారు, అత్తిలి మండలనం పార్టీ అధ్యక్షులు పైబోయిన సత్యనారయణ, తణుకు పట్టణ పార్టీ అధ్యక్షులు మంగెన సూర్య, అత్తిలి ఏఎంసీ చైర్మాన్ బుద్దరాతి భరణీ ప్రసాద్, డీసీఎంఎస్ చైర్మన్ పెనుమత్స సుబ్బరాజు, శెట్టిబలిజ కార్పోరేషన్ చైర్మన్ గుబ్బల తమ్మయ్య, రేలంగి పార్టీ అధ్యక్షులు పులుపు అనిల్ కుమార్, రేలంగి సోసైటీ అధ్యక్షులు నడింపల్లి శ్రీరామరాజు, తణుకు నియోజక వర్గ పరిశీలకులు జక్కంశెట్టి సత్య రాజేంద్ర ప్రసాద్, తణుకు, రేలంగి మహిళా అధ్యక్షులు నూకలు కనక దుర్గ, మెట్ల కిరణ్మయి, రేలంగి ఎంపీటీసీ డి మహాలక్ష్మీ, రేలంగి 2వ వార్టు మెంబర్ పులుపు సునీల్ కుమార్, వైసీపీ సెక్రటరీ ఎఎంసీ డైరెక్టర్ తాతిపూరి బోస్, రేలంగి ఎక్స్ సర్పంచ్ మైనం పాము, ఇరగవరం వైసీపీ నేతలు జవ్వాది సురేష్, జుత్తుక కిషోర్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.