తీరికలేకుండా గడిపారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర
ప్రజాప్రతినిధులతో కలిసి సోలాపుర్ చేరుకున్న ఆయన పలు కార్యక్రమాల్లో
పాల్గొన్నారు. ఉదయం పండరిపుర్లోని విఠలేశ్వరస్వామి, రుక్మిణీదేవిలను
దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తరద్వారం గుండా ఆలయంలోకి
చేరుకున్న సీఎంకు ఆలయ అర్చకులు, నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. సీఎం
కేసీఆర్ దేవీ, దేవతలకు పట్టు వస్త్రాలు సమర్పించారు. విఠలేశ్వరుడి పాద
ముద్రికలు, మూల విరాట్ దర్శనానంతరం రుక్మిణీ అమ్మవారి పాదాలను పసుపు
కుంకుమలతో అలంకరించి మొక్కుకున్నారు. దైవదర్శనం కోసం ఆలయం దిశగా వెళ్తున్న
సీఎం కేసీఆర్కు దారిలో ఓ వృద్ధ భక్తుడు విఠలేశ్వరుడు, రుక్మిణీ అమ్మవార్లతో
కూడిన ప్రతిమను బహూకరించారు. అనంతరం సీఎం కేసీఆర్ మహారాష్ట్ర నాయకుడు భగీరథ్
బాల్కే ఆహ్వానం మేరకు సర్కోలిలోని వారి నివాసానికి చేరుకున్నారు. అక్కడే
మధ్యాహ్న భోజనం చేశారు.
భగీరథ్ బాల్కే తండ్రి దివంగత భరత్ బాల్కే సమాధి వద్దకు చేరుకుని నివాళి
అర్పించారు. తర్వాత సర్కోలీలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.
అనంతరం సోలాపుర్లో స్థానిక భవానీపేట కార్పొరేటర్ నగేష్ వల్యాల్ ఆహ్వానం
మేరకు వారి నివాసానికి చేరుకున్నారు. వారి ఆతిథ్యం స్వీకరించి కాసేపు
ముచ్చటించారు. వరంగల్ ప్రాంతానికి చెందిన తమ పూర్వీకులు సోలాపుర్కు వచ్చి
స్థిరపడ్డారని వారు సీఎంకు వివరించారు. నగేష్ వల్యాలకు గులాబీ కండువా కప్పి
పార్టీలోకి ఆహ్వానించారు. తిరుగు ప్రయాణంలో తుల్జాపూర్లోని తుల్జా భవానీ
అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. ఆలయ
అధికారులు సీఎం కేసీఆర్కు సంప్రదాయబద్ధంగా తలపాగాను ధరింపజేసి, శాలువాతో
సత్కరించి అమ్మవారి ప్రతిమను అందజేశారు. అక్కడ విలేకరులు అడిగిన ప్రశ్నలకు
సమాధానమిచ్చారు. అనంతరం సీఎం కేసీఆర్ సహా ప్రజాప్రతినిధులు హైదరాబాద్కు
చేరుకున్నారు.