విశాఖపట్నం : విశాఖ మారుతి జంక్షన్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం రాత్రి రోడ్ షో నిర్వహించారు. 1.5 కిలోమీటర్ల మేర రోడ్‌షోలో ప్రధాని పాల్గొన్నారు. విశాఖ ఐఎన్ఎస్ చోళ గెస్ట్‌హౌస్‌కు ప్రధాని చేరుకున్నారు. రాత్రికి అక్కడ బస చేస్తారు.
ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం : ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి విడదల రజిని స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి ప్రధాని చోళ (నౌకా దళానికి చెందిన గెస్ట్ హౌస్)కు వెళ్లి రాత్రి అక్కడే బస చేస్తారు. శనివారం ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో భారీ బహిరంగసభ నిర్వహంచనున్నారు. ప్రధాని మోడీ సభావేదికపై గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మాత్రమే ఉంటారు. సభలో 40 నిమిషాల పాటు ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.