పారిస్ : ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి అరుదైన
గౌరవం లభించింది. ఆతిథ్య దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ మోడీని
‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ ఆన్ర్’ పురస్కారంతో సత్కరించారు.
ఫ్రాన్స్ అత్యున్నత పౌర, సైనిక పురస్కారాన్ని అందుకున్న తొలి భారత ప్రధాని
నరేంద్ర మోడీనే కావడం విశేషం. గురువారం ఎలీసీ ప్యాలెస్లో జరిగిన కార్యక్రమంలో
అధ్యక్షుడు మేక్రాన్ మోడీకి ఈ పురస్కారం అందజేశారు. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా
మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా, బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్, జర్మనీ
మాజీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రటరీ జనరల్
బుట్రోస్ బుట్రోస్ ఘలి వంటి వారు ఈ అవార్డును అందుకున్నారు. ఇప్పుడు వారి
సరసన మోడీ చేరారు.