న్యూఢిల్లీ : ఈనెల 22న యూఎస్ కాంగ్రెస్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రధానమంత్రి
మోదీ ప్రసంగించనున్నారు. ఈమేరకు సెనేట్ సభాపతి కెవిన్ మెక్ కార్తి స్వయంగా
భారత ప్రధాని మోడీని ఆహ్వానించారు. ఈ సభలో ప్రధాని భారత్ అమెరికా సంబంధాల
రీత్యా అనుసరించాల్సిన భవిష్యత్తు కార్యాచరణతోపాటు ఉభయ దేశాలు ప్రాపంచికంగా
ఎదుర్కొంటున్న సవాళ్లపై ప్రసంగం చేయనున్నారు.

మోడీ అరుదైన ఘనత : ఏడేళ్ల కిందట 2016లో ఇదే వేదికపై ప్రసంగించారు మోడీ.
బ్రిటీష్ మాజీ ప్రధాని విన్స్టన్ చర్చిల్, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు
నెల్సన్ మండేలా తర్వాత రెండు సందర్భాల్లో యూఎస్ కాంగ్రెస్ను ఉద్దేశించి
ప్రసంగించిన నాయకుడిగా చరిత్ర సృష్టించనున్నారు.
2016 ప్రసంగంలో మోడీ : గతంలో మోడీ ఇదే సభను ఉద్దేశించి మాట్లాడుతూ వాతావరణ
మార్పుల నుంచి ఉగ్రవాదం వరకు, రక్షణ శాఖ, భద్రతా వ్యవహారాలు, వాణిజ్య
సంబంధాలు, రెండు దేశాల మధ్య ఆర్ధిక పురోగతి వంటి అనేక అంశాలను స్పృశించారు.