సైదాపురం : ప్రధానమంత్రి నరేంద్రమోడీ 2014 సంవత్సరం నుంచి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెంకటగిరి నియోజకవర్గ బీజేపీ సమన్వయకర్త ఎస్.ఎస్.ఆర్. నాయుడు పేర్కొన్నారు. సైదాపురం మండలంలోని గిద్దలూరు గ్రామం సచివాలయ ప్రాంగణంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ముందుగా వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర కార్యక్రమం ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వెంకటగిరి నియోజకవర్గ బీజేపీ సమన్వయకర్త ఎస్.ఎస్.ఆర్. నాయుడు మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలో దేశంలోని పేదలందరికీ సమన్యాయం జరుగుతోందన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి ప్రజలకు చేరువ చేసిన పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో శఙ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కోఆర్డినేటర్ శివారెడ్డి, గ్రామ సర్పంచ్, ప్రజలు పాల్గొన్నారు.