ముంబయి : ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేయాలంటూ రైతులు ప్రధాని మోదీకి
విజ్ఞప్తి చేశారు. ఉల్లి పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో దుఖఃలో ఉన్న
అన్నదాతలు ప్రధానికి ఉల్లిపాయల్ని పార్శిల్ చేసి తమ నిరసన తెలిపారు. ధరల పతనం
ఉల్లి రైతుల్ని కోలుకోలేని దెబ్బతీసింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు
మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు పుట్టెడు ఆవేదనలో ఉన్నారు.
మహారాష్ట్రకు చెందిన రాజేంద్ర చవాన్ అనే రైతు ఇటీవల 512 కిలోల ఉల్లిని
షోలాపూర్ మార్కెట్‌కు తీసుకెళ్లగా అక్కడి వ్యాపారులు కేవలం రూ.512లకు
కొనుగోలు చేశారు. దీంతో మొత్తం ఖర్చులు పోగా ఆయనకు కేవలం రూ.2లే మిగిలినట్టు
వచ్చిన వార్తలు అన్నదాతల దుస్థితికి అద్దంపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో
ఉల్లి రైతులు వినూత్న నిరసన తెలిపారు. ఉల్లి ధరల పతనం నుంచి తమకు ఉపశమనం
కలిగించాలంటూ మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌కు చెందిన రైతులు ప్రధాని నరేంద్ర
మోదీకి విజ్ఞప్తి చేశారు.అలాగే, ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ ప్రధానికి ఉల్లిపాయలను
పార్శిల్ చేసి పంపినట్టు షెట్కారీ సంఘటన, షెట్కారీ వికాస్ మండల్‌కు చెందిన
రైతులు తెలిపారు. ఉల్లిపాయలు సహా ఇతర వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై విధించిన
నిషేధాన్ని తక్షణమే ఎత్తివేయాలనేది తమ డిమాండ్ అన్నారు. అలా చేయడం ద్వారా
రైతులకు అంతర్జాతీయ మార్కెట్‌ను తెరిచేందుకు వీలుంటుందని తెలిపారు. అలాగే,
గతేడాది తమ ఉత్పత్తుల్ని విక్రయించిన రైతులకు క్వింటాల్‌కు రూ.1000 చొప్పున
పరిహారంగా ఇవ్వాలని ప్రధానిని కోరినట్టు ఓ రైతు తెలిపారు. ఇన్పుట్ ఖర్చు
భారీగా ఉందని.. ఎరువులు, పురుగు మందులు, పెట్రోల్, డీజిల్‌కు రైతులు
అంతర్జాతీయ మార్కెట్ ధరలే చెల్లిస్తున్నారని చెప్పారు. తీరా, తమ ఉత్పత్తులను
మాత్రం దేశీయ ధరలకే విక్రయించాల్సి వస్తోందని వాపోయారు.