*తిరుపతి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి.
కలువాయి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ :
ఆంధ్రప్రదేశ్ రాష్టాన్ని ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి తాకట్టు పెట్టారని తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి ఆరోపించారు. కలువాయి తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం మార్పు రావాలి.. కాంగ్రెస్ కావాలి కార్యక్రమం పై ర్యాలీ జరిగింది.ఈ కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ… ఆంధ్ర రాస్తానికి పత్యేక హోదా వద్దన్న వ్యక్తి చంద్రబాబునాయుడు అయితే సీఎం జగన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి రాష్టాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఆర్తుర్పాడు రిజర్వాయర్, నడి కుడి రైల్వే లేన్,ఎస్ ఎస్ కెనాల్, తిరుపతి లో అంతర్జాతీయ క్రీడా ప్రాంగణం తీసుకరావడం జరిగిందని తెలియజేసారు. ఇవీ ఏమి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు తీసుక రాలేకపోయాయని చెప్పారు.అభివృద్ధి చేయడం లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు విఫలం అయ్యాయని ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తునాయని తెలిపారు.ఈ కార్యక్రమం లో సర్వేపల్లి నియోజకవర్గం సమన్వయ కర్త చంద్రశేఖర్ రావు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మండల పార్టీ అధ్యక్షులు గా నిజమాల చిన్నయ్య, ఉపాధ్యక్షులు గా కృష్ణయ్య లను నియమించారు.
………..
సార్ ఫోటో రైటప్ తిరుపతి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి కార్యకర్తలు.