ఆర్టికల్ 370 రద్దు, ట్రిబుల్ తలాక్ వంటి విప్లవాత్మక నిర్ణయాలు
నూతన సాంకేతికత ఆధారంగా పౌరులకు సేవలు
న్యూఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దు, ట్రిబుల్ తలాక్ వంటి విప్లవాత్మక
నిర్ణయాలు తీసుకున్నామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రాబోయే
పాతికేళ్లలో వికసిత భారతం దిశగా అడుగులు పడాలని, ప్రపంచమంతా భారత్ వైపు ఆశావహ
దృక్పథంతో చూస్తోందని చెప్పారు. నూతన సాంకేతికత ఆధారంగా పౌరులకు
సేవలందుతున్నాయని, అభివృద్ధితో పాటు ప్రకృతిని కాపాడుతున్నామన్నారు. ద్రౌపది
ముర్ము. మాది ప్రజల ఆత్మవిశ్వాసం పెంచే ప్రభుత్వమని, సర్జికల్ స్ట్రైక్
ద్వారా సరిహద్దులు దాటిన ముష్కర మూకలను మట్టుబెట్టామన్నారు. ఆర్టికల్ 370
రద్దు, ట్రిబుల్ తలాక్ వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నామని రాష్ట్రపతి
పేర్కొన్నారు.
అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం ఉరుముతున్న వేళ భారత పార్లమెంటు బడ్జెట్
సమావేశాలు మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. సెంట్రల్ హాలులో ఉభయసభల
సభ్యులను ఉద్దేశించి ప్రసంగించడం ద్వారా రాష్ట్రపతి ద్రౌపదీముర్ము వీటికి
శ్రీకారం చుట్టారు. గత ఏడాది జులై 25న రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత
ఆమె లోక్‌సభ, రాజ్యసభల సంయుక్త సమావేశంలో ప్రసంగించడం ఇదే తొలిసారి.
రాష్ట్రపతి ప్రసంగం అయిన వెంటనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఆర్థిక సర్వేను సభ ముందుంచనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఆమె దిగువ సభలో
2023-24 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. గురువారం నుంచి ఉభయ సభల్లో రాష్ట్రపతి
ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభమవుతుంది. ప్రధాని
నరేంద్ర మోడీ జవాబు ఇవ్వనున్నారు. ఆ వెంటనే బడ్జెట్‌పై చర్చ మొదలవుతుంది.
ఆర్థిక మంత్రి సమాధానమిస్తారు. వివిధ శాఖలకు కేటాయింపులపై స్థాయీ సంఘాలు
అధ్యయనం జరిపి నివేదికలు సమర్పించడానికి పార్లమెంటుకు ఫిబ్రవరి 14 నుంచి
మార్చి 12వ తేదీ వరకు విరామం ఇవ్వనున్నారు. రెండో దఫా సమావేశాల్లో శాఖల వారీ
బడ్జెట్ కేటాయింపులు, ఆర్థిక బిల్లుపై చర్చిస్తారు.