హెచ్చరించిన ఐక్యరాజ్య సమితి
న్యూయార్క్ : ప్రపంచ వ్యాప్తంగా 240 కోట్ల మంది ప్రజలకు గతేడాది ఆహారం
నిరంతరంగా లభించ లేదని ఐక్యరాజ్య సమితి తెలిపింది. 78.3 కోట్ల మంది ప్రజలు
క్షుద్బాధను ఎదుర్కొన్నారని, 14.8 కోట్ల మంది చినాురులు పోషకాహారం లోపంతో
ఎదుగుదల సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపింది. 2023లో అంతర్జాతీయ ఆహార భద్రత,
పోషకాహారంపై ఐక్యరాజ్య సమితికి చెందిన ఐదు సంస్థలు ఒక నివేదికను విడుదల
చేశాయి. 2021, 2022 సంవత్సరాల మధ్య కాలంలో ఆకలితో బాధపడే వారి సంఖ్యలో
పెరుగుదల లేదని, కానీ చాలా ప్రాంతాలు తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని
ఎదుర్కొన్నాయని పేర్కొంది. పశ్చిమాసియా, కరేబియన్ ప్రాంతాల్లో, ఆఫ్రికా
ఖండంలోని 20శాతం జనాభా క్షుద్భాధను ఎదుర్కొనాురు. ఇది, ప్రపంచ సగటు కనాు
రెట్టింపునకు పైగానే వుంది. అలాగే కరోనా నుండి ప్రపంచ దేశాలు కోలుకునే తీరు
కూడా అంతటా సమానంగా లేదని ఆహారం, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఎఓ) డైరెక్టర్ జనరల్
క్యూ డోంగ్యూ పేర్కొన్నారు. పైగా ఉక్రెయిన్లో యుద్ధం పోషకాహారం, ఆరోగ్యకరమైన
ఆహారాన్ని బాగా ప్రభావితం చేసిందనాురు. ”వాతావరణ మార్పులు, ఘర్షణలు, ఆర్థిక
అస్థిరత వంటివనీు ప్రజలను భద్రత నుండి మరింత దూరంగా తోస్తున్నపుడు ఇదే ‘కొత్త
రకమైన సాధారణ పరిస్థితి’ అని ఆయన వ్యాఖ్యానించారు. 2021లో ప్రపంచ జనాభాలో
42శాతం మంది అంటే 310 కోట్ల మంది ప్రజలకుఆరోగ్యకరమైన ఆహారం లభించలేదని ఆ
నివేదిక పేర్కొంది. 2019లో ఈ సంఖ్య కేవలం 13.4 కోట్లుగా వుందనితెలిపింది.
అనారోగ్యరమైన ఆహారాన్ని తీసుకునే వారి సంఖ్య తగ్గించడమనేది పెద్ద సవాలుగా
పరిణమించిందని ఎఫ్ఎఓ ప్రధాన ఆర్థికవేత్త మాక్సిమో టోరెకో చెప్పారు. వ్యవసాయ
రంగంలో, వ్యవసాయాధారిత ఆహార వ్యవస్థలో మన వనరులను ఉపయోగించుకునే తీరులో
గణనీయంగా మార్పులు రావడమే ఇందుకు కారణమన్నారు. తాజా పరిశోధన ప్రకారం 2022లో
తీవ్రంగా పోషకాహార లోపంతో బాధపడేవారి సంఖ్య సగటున 73.5 కోట్లుగా వుందనాురు.
కోవిడ్ ప్రారంభం కావడానికి ముందు 2019లోని సంఖ్య కన్నా 12.2 కోట్లు ఎక్కువగా
వుందని చెప్పారు.