సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ
విజయవాడ : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక
సదస్సుకు ఎందుకు వెళ్ళలేదో వెల్లడించాలని, గత మూడున్నరేళ్లలో ఏపీకి ఎన్ని
పెట్టుబడులు వచ్చాయో శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె
రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు రామకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల
దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరు
కాలేదు. గత మూడున్నర ఏళ్ల కాలంలో కొత్తగా ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తదుపరి గత మూడున్నరేళ్లలో ఏపీకి ఎన్ని పెట్టుబడులు
వచ్చాయో, కొత్తగా ఎన్ని పరిశ్రమలు ఏర్పాటయ్యాయో శ్వేతపత్రం విడుదల చేయాలని
రాష్ట్ర ప్రభుత్వాన్ని కె రామకృష్ణ డిమాండ్ చేశారు.