జాబితాలో సావిత్రి జిందాల్
93 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో ప్రాంకోయిస్
ఫోర్బ్స్ ప్రపంచ మహిళా కుబేరుల జాబితాను విడుదల చేసింది. రియల్ ఎస్టేట్ రంగం
నుండి రిటైల్, క్యాసినో, కాస్మోటిక్స్, బ్యాంకింగ్ ఇలా వివిధ రంగాల మహిళలు
ఉన్నారు. టాప్ టెన్ లో 8 మంది అమెరికా నుండి ఉండటం గమనార్హం. ఈ జాబితాలో
సావిత్రీ జిందాల్ కూడా ఉన్నారు. వరల్డ్ టాప్ 20 మహిళా ధనికుల జాబితాలో
ఫ్రాంకోయిస్ బెట్టెన్ కోర్ట్ మొదటి స్థానంలో ఉన్నారు. 93 బిలియన్ డాలర్లతో
మహిళా ధనికుల్లో మొదటి స్థానంలో, ఫోర్బ్స్ బిలియనీర్స్ జాబితాలో 9వ స్థానంలో
నిలిచారు. 1997 నుండి ఆమె ఎల్ఓరియల్ లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మెంబర్ గా
ఉంటున్నారు. బెట్టెన్ కోర్ట్ , ఆమె కుటుంబం ఈ కంపెనీలో 33 శాతం స్టాక్స్ కలిగి
ఉన్నారు. వాల్ మార్ట్ ఫౌండర్ శామ్ వాల్టన్ కూతురు ఎలిస్ వాల్టన్ 61.4 బిలియన్
డాలర్లతో మహిళా కుబేరుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ఆమె తన కెరీర్
ప్రారంభంలో పెట్టుబడులపై దృష్టి పెట్టారు. ఆ తర్వాత క్రమంగా సొంతంగా లియామా
కంపెనీని ప్రారంభించారు. 1990లలో అది మూతపడింది. జులియా కోచ్, కుటుంబం 59
బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో నిలిచారు. కోచ్ ఇండస్ట్రీస్ లో వీరికి 42 శాతం
వాటా ఉంది. ఆమె లోవాలో జన్మించారు. ఫ్యాషన్ ఇండస్ట్రీ కోసం 1980లలో న్యూయార్క్
కు వెళ్లారు. ప్రస్తుతం ఈమె డేవిడ్ హెచ్ ను లీడ్ చేస్తున్నారు. 38.3 బిలియన్
డాలర్లతో జాక్వెలీన్ మార్స్ నాలుగో స్థానంలో ఉన్నారు. ఈమె మార్స్ క్యాండీ
కంపెనీ వ్యవస్థాపకులు ప్రాంక్ మార్స్ మనవరాలు. క్యాసినో కంపెనీ లాస్ వెగాస్
సాండ్స్ లో మెజార్టీ వాటా కలిగిన మిరియమ్ అడెల్సన్ 37.7 బిలియన్ డాలర్లతో 5వ
స్థానంలో ఉన్నారు.
షిప్పింగ్ సంస్థ ఎంఎస్సీ సహ యజమాని రఫేలా అపోంటే 31.3 బిలియన్ డాలర్ల సంపద
కలిగి ఉన్నారు.
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకంజీ స్కాట్ 27.6 బిలియన్ డాలర్ల
సంపదను కలిగి ఉన్నారు. 2019లో విడాకుల సెటిల్మెంట్ లో భాగంగా బెజోస్ భారీ
మొత్తం ఇచ్చారు.
ఆస్ట్రేలియన్ గినా రినెహార్ట్ తన తండ్రి తర్వాత హాన్ కాక్ ప్రాస్పెక్టింగ్
కంపెనీని రన్ చేస్తున్నారు. ఈమె సంపద 27.3 బిలియన్ డాలర్లుగా ఉంది. ఎకనమిస్ట్
గా కెరీర్ ప్రారంభించిన సుసాన్నే క్లేటన్ 24.7 బిలియన్ డాలర్ల సంపదను కలిగి
ఉన్నారు. ఐరిస్ ఫోంట్బనా ఆమె కుటుంబం 22.8 బిలియన్ డాలర్లు, అబిగెయిల్
జాన్సన్ 21.6 బిలియన్ డాలర్లు, సావిత్రి జిందాల్ అండ్ ఫ్యామిలీ 17.6 బిలియన్
డాలర్లు, విక్కీ సఫ్రా అండ్ ఫ్యామిలీ 17 బిలియన్ డాలర్లు, రెనాటా కెల్నెరోవా
అండ్ ఫ్యామిలీ 17 బిలియన్ డాలర్లు, బీట్ హెస్టర్ 15.9 బిలియన్ డాలర్లు,
చార్లెన్ డీ కార్వాలో – హీనెకెన్ అండ్ ఫ్యామిలీ, 15.9 బిలియన్ డాలర్లు, వోంగ్
సూ-హింగ్ 14.5 బిలియన్ డాలర్లు, డయాన్ హెన్డ్రక్స్ 13.7 బిలియన్ డాలర్లు,
లారెన్ పోవెల్ జాబ్స్ అండ్ ఫ్యామిలీ 12.8 బిలియన్ డాలర్లు, క్రిస్టీ వోల్టన్
11 బిలియన్ డాలర్ల సంపదను కలిగి ఉన్నారు.