నవ్యసాచి, మిస్టర్ మజ్ను , ఇస్మార్ట్ శంకర్ వంటి చిత్రాలతో ప్రేక్షకులలో మంచి
గుర్తింపు తెచ్చుకున్న నిధి అగర్వాల్ ప్రస్తుతం పవన్ కల్యాణ్ సరసన హరి హర
వీరమల్లు చిత్రంలో నటిస్తున్నది. తాజా సమాచారం ప్రకారం తెలుగులో ఈ భామ మరో
బంపర్ ఆఫర్ చేజిక్కించుకున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెలితే, ప్రభాస్
కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో వీరియాడిక్ హారర్ కామెడీ చిత్రం
తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో నిధి అగర్వాల్ కథానాయికగా ఖరారు
చేశారని తెలిసింది. ఈ చిత్రానికి ‘రాజా డీలక్స్’ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు
తెలిసింది. ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. గత
చిత్రాలకు భిన్నంగా అద్యంతం వినోదంతో ఆకట్టుకునే చిత్రమిదని చెబుతున్నారు. ఈ
సినిమా చిత్రీకరణలో నిధి అగర్వాల్ త్వరలో పాల్గొనబోతున్నట్లు సమాచారం.