ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం
‘కల్కి 2898 ఎ.డి. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ
కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో మరో యువ అగ్రకథానాయకుడు కూడా
నటించనున్నట్లు సమాచారం. ‘కింగ్ ఆఫ్ కొత్త’ సినిమాతో అభిమానులను అలరించడానికి
సిద్ధంగా ఉన్న దుల్కర్ సల్మాన్ ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాలో ఓ
ప్రత్యేక పాత్ర చేయనున్నట్లు వార్తలొచ్చాయి. వీటి గురించి దుల్కర్ ఇటీవల
జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ఈ విషయం గురించి నేనిప్పుడు చెప్పాలనుకోవడం
లేదు. కానీ భవిష్యత్తు నేపథ్యంలో జరిగే కథ ఇది. సెట్స్ మాత్రం చాలా అద్భుతంగా
ఉన్నాయి. ఇలాంటివి దర్శకుడు నాగ్ అశ్విన్ మాత్రమే డిజైన్ చేయగలడు’ అని
చెప్పారు. తాను ఆ సినిమా సెట్స్ ను సందర్శించానని, గతంలో తీసిన ‘ఎవడే
సుబ్రమణ్యం’ చిత్రం కంటే కొత్తగా నాగ్ ఈ సినిమాను చిత్రీకరించనున్నారని
తెలిపారు దుల్కర్. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నిర్మిస్తోన్న
‘కల్కి’ వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది.