శ్రీకాకుళం : రాష్ట్ర భవిష్యత్తు గాలికి వదిలేసి, అభివృద్ధిని పూర్తిగా
పక్కనపెట్టిన ఈ ప్రభుత్వం మీద రాష్ట్ర యువత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ ప్రజా
వ్యతిరేక వైసీపీ ప్రభుత్వంపై తిరగబడి, ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారని
జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. జనవరి 12వ తేదీన
జరగనున్న ‘యువ శక్తి’ కార్యక్రమం సభాస్థలిని శనివారం సాయంత్రం ఆయన
పరిశీలించారు. సభా వేదిక, సౌకర్యాలు, ఇతర ఏర్పాట్లపై పార్టీ కార్యక్రమాల
నిర్వహణ కమిటీ కన్వీనర్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్ తో చర్చించారు. ఈ
సందర్భంగా సభాస్థలి వద్ద నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ “మన యువతరం
కోసం వారి భవిష్యత్తు కోసం నిర్వహించే కార్యక్రమం ఇది. రాష్ట్రవ్యాప్తంగా
వచ్చే యువతరానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. ఉత్తరాంధ్ర సాహిత్యం,
సంప్రదాయం, సంస్కృతి తో పాటు ఉత్తరాంధ్ర సమస్యల మీద యువతరం పవన్ కళ్యాణ్
సమక్షంలో మాట్లాడతారు. ఉత్తరాంధ్రలోని వెనుకబాటుతనం, వలసలు, మత్స్యకారుల
సమస్యలు ఇతర అంశాల మీద 100 మంది యువతీయువకులు పవన్ కళ్యాణ్ సమక్షంలో వారి
అభిప్రాయాలను వేదిక నుంచి పంచుకుంటారు. ఈ అవకాశం కోసం పార్టీ కేటాయించిన 20
ఫోన్ లైన్లలో రెండు రోజుల్లోనే సుమారు 6 వేల ఫోన్ కాల్స్, 2 వేలకు పైగా
ఈమెయిల్స్ ఇప్పటి వరకు మాకు అందాయి. 8వ తేదీ తర్వాత ఈ ఫోన్ కాల్స్, ఈ మెయిల్స్
ఎన్ని వచ్చాయి. ఏమిటీ అనేది పూర్తిగా వెల్లడిస్తాం. రాష్ట్ర యువత
పూర్తిస్థాయిలో ఆవేదనతో నిండి ఉన్నారన్నారు.
ఉత్తరాంధ్ర వలసలు నిరోధానికి, మత్స్యకారుల
సమస్యలు పూర్తిగా తీర్చడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్నది
వివరిస్తారు. రణస్థలంలో 12వ తేదీన జరగబోయే సభ కోసం 30 ఎకరాల స్థలంలో ఏర్పాట్లు
పూర్తిస్థాయిలో జరుగుతున్నాయి. పార్కింగ్ సదుపాయం, మరుగుదొడ్లు, భోజన
ఏర్పాట్లు, లైటింగ్ ఇతరత్రా అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఉండేలా
జాగ్రత్తలు తీసుకుంటున్నాం. శ్రీకాకుళం జిల్లా పోలీసులు నుంచి కూడా
పూర్తిస్థాయి అనుమతులు వచ్చాయి. జనసేన పార్టీ ఎల్లప్పుడు చట్టాన్ని
గౌరవిస్తుంది. పోలీసులకు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తాం. వారు చెప్పిన అన్ని
నిబంధనలు పాటించి సభను విజయవంతం చేస్తాం. అన్ని అంశాలను పరిశీలించి సభకు
అనుమతి ఇచ్చిన పోలీసులకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ
సభను పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని కోరుతున్నానన్నారు.
సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కోన తాతారావు, పితాని బాలకృష్ణ, పార్టీ
రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు టి.శివశంకర్, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జనసేన
పార్టీ నాయకులు కాంతిశ్రీ, పేడాడ రామ్మోహన్, గేదెల చైతన్య, సందీప్
పంచకర్ల, పీవీఎస్ఎన్ రాజు, అమ్మిశెట్టి వాసు, బేతపూడి విజయ్ శేఖర్, మూగి
శ్రీనివాస్, ఎన్ని రాజు, పాత్రుని పాపారావు తదితరులు పాల్గొన్నారు.