ఆంధ్ర ప్రదేశ్ తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్ డాక్టర్ నందమూరి లక్ష్మీ పార్వతి
ప్రతి ఏటా ప్రభుత్వమే విజయవాడలో నిర్వహించాలి
ఆర్టీఐ కమీషనర్ శ్యాముల్ జోనాధన్
సాహిత్యంతో మానసిక ఉల్లాసం
ఆంధ్ర ప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్ప రాజు
వెంకటేశ్వర్లు
విజయవాడ : ప్రభుత్వం తరపున సాహితీ, సాంస్కృతిక రంగాలకు అవసరమైన ప్రోత్సాహం
అందిస్తామని ఆంధ్ర ప్రదేశ్ తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్ డాక్టర్ నందమూరి
లక్ష్మీ పార్వతి అన్నారు. మల్లె తీగ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ
సాంస్కృతిక ఉత్సవాల్లో భాగంగా నవ్యాంధ్ర రచయితల సంఘం అధ్యక్షుడు, కళారత్న
బిక్కి కృష్ణ సభాధ్యక్షులుగా రెండో రోజు జరిగిన కార్యక్రమంలో లక్ష్మీ పార్వతి
పాల్గొని ప్రసంగించారు. లోహం, మోహం మోజులో పడితే జీవితం అగాథమేనని, సంపాదన పై
మోజుతో మనిషి పని చేస్తే జీవితం అంతవరకే పరిమితం అవుతుందని, ఒకరు తక్కువ…
ఒకరు ఎక్కువ అన్న బేధాలు లేకుండా ఏకాగ్రతతో సాధిస్తే సాధ్యమని, అందుకు ఉదాహరణ
తమ్ముడు కలిమి శ్రీ అన్నారు. ఆర్థికమైన వనరులు అందకున్నా.. పెద్దల అండ
లేకున్నా… మంచి తనంతో ఐదుగురు అక్షర యోధులు ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని
నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు సంబంధించిన అన్ని
విషయాలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లి తన వంతు సాయం చేస్తానని లక్ష్మీ
పార్వతి హామీ ఇచ్చారు.
ప్రతి ఏటా ప్రభుత్వమే విజయవాడలో నిర్వహించాలి ఆర్టీఐ కమీషనర్ శ్యాముల్ జోనాధన్
విజయవాడలో మల్లెతీగ ఆధ్వర్యంలో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహించడం
సంతోషకరంగా ఉందని, ఎంతోమంది విమర్శకులు, కవులు, రచయితలు, చిత్రకారులు,
కళాకారులు విజయవాడ నుంచి వచ్చారని, కవులు, రచయితలు నేటి సమాజానికి అర్థమయ్యేలా
విస్తృత ప్రచారం జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అన్నారు. ఇలాంటి
కార్యక్రమాలను ప్రతి సంవత్సరం ప్రభుత్వమే విజయవాడలో నిర్వహించేలా చర్యలు
తీసుకోవాలని కోరుకుంటున్నానని
ఆర్టీఐ కమీషనర్ శ్యాముల్ జోనాధన్ ఆకాంక్షించారు.

వెంకటేశ్వర్లు నిత్యం విధి నిర్వహణలో సతమవుతున్న వారికి ఇలాంటి సాహిత్య
కార్యక్రమాలు ఎంతో మానసిక ఉల్లాసం.. ఉత్సాహం అందిస్తాయని ఆంధ్ర ప్రదేశ్
రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్ప రాజు వెంకటేశ్వర్లు అన్నారు.
ప్రభుత్వం నిర్వహించాల్సిన ఇలాంటి సాహిత్య కార్యక్రమాలను తమకు ఎంత కష్టమైనా…
ఇష్టంతో ఓర్పు.. నేర్పుతో కలం వీరులు నిర్వహించడం ఆనందంగా
ఉందన్నారు. ఈసందర్భంగా శ్రీమతి ఘంటా ఇందిర స్మారక మల్లె తీగ కార్టూన్ల పోటీ
విజేతలకు లక్ష్మీ పార్వతి బహుమతులు అందజేశారు. అలాగే కార్య నిర్వాహక కమిటీ
సభ్యులు కలిమి శ్రీ, ఇస్కా రాజేష్ బాబు, చొప్పా రాఘవేంద్ర శేఖర్, యేమినేని
వెంకట రమణ, వల్లూరు ప్రసాద్ కుమార్, చైతన్య కలం ఎడిటర్ షేక్ మన్నూరు గౌస్
మొహియుద్దీన్, తెలుగు నాడు ఎడిటర్ హరి ప్రసాద్, జర్నలిస్టు సురేష్ బాబు లను
లక్ష్మీ పార్వతి సత్కరించారు. అనంతరం సమకాలీన తెలుగు కవిత్వం తీరు తెన్నులు పై
ప్రసిద్ధ కవి బంగార్రాజు కంఠ సభాద్యక్షులుగా జరిగిన కార్యక్రమంలో సాహితీ
ప్రస్థానం వర్కింగ్ ఎడిటర్ సత్యాజీ, సుప్రసిద్ధ కవి జి. లక్ష్మీ నరసయ్య,
కొప్పర్తి, అరసవిల్లి కృష్ణ, కోసూరి రవికుమార్, శిఖా ఆకాష్, సరికొండ నరసింహ
రాజు, పి శ్రీనివాస గౌడ్ పాల్గొన్నారు.
మధ్యాహ్నం వర్తమాన కథ – సామాజిక అంశాలు పై ప్రసిద్ధ కథకులు వేంపల్లె షరీఫ్
అధ్యక్షతన జరిగిన సమావేశంలో అరసం జాతీయక్ కార్యదర్శి డాక్టర్ పెనుగొండ లక్ష్మీ
నారాయణ, సుప్రసిద్ధ కథకులు కాట్రగడ్డ దయానంద్, కథా, నవలా రచయిత సాగర్ శ్రీరామ
కవచం, విశిష్ట అతిథిలుగా ప్రసిద్ధ రచయిత చంద్ర శేఖర ఆజాద్, రచయిత్రి ఉమా
నూతక్కి, ప్రసిద్ధ కథకులు ఎం వీ రామిరెడ్డి పాల్గొన్నారు. సాయంత్రం ప్రసిద్ధ
కవి చిన్ని నారాయణ రావు సమన్వయంతో కవిత్వంతో ఈ ఆదివారం కార్యక్రమాన్ని ఘనంగా
నిర్వహించారు.