రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ
రుపేదలకు మెరుగైన వైద్యం అందిస్తాం
కోదాడలో 26 కోట్లతో 100 పడకల వైద్యశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన
సిటీ స్కాన్, టి ఫా అల్ట్రా సౌండ్ సెంటర్ మంజూరు
ఆసుప్రతుల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత
మంత్రులు రాజ నర్సింహ, నలమాద ఉత్తమ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు
హుజూర్ నగర్ : విద్యా, వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ అన్నారు. బుధవారం ముందుగా స్థానిక హుజూర్ నగర్, ఏరియా ఆసుపత్రి ని సహచర మంత్రులైన రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖా మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తో కలసి పరిశీలించి రోగుల వార్డులలో కలియ తిరిగి అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. తదుపరి ఏర్పాటు చేసిన వైద్య వసతులపై వైద్యాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేద, నిరుపేద లకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవాలందలని అన్నారు. ఈ నియోజక వర్గంలో మారుమూల మండలాల నుండి వచ్చే రోగులకు కార్పోరేట్ స్థాయిలో వైద్య సేవాలందలని వైద్య వృత్తి చాలా పవిత్రమైనదని అన్నారు. హుజూర్ నగర్ నియోజక వర్గంలో ఉన్న phc లలో వసతుల కల్పన, ఏరియా ఆసుపత్రిలో కావలసిన వసతులపై ప్రతిపాదనలు సత్వరమే అందించాలని సూచించారు.
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ కింద 1800 వ్యాధులకు రూ.487 కోట్లు ఖర్చు చేస్తున్నామని అలాగే రాజీవ్ ఆరోగ్య శ్రీ ని 10 లక్షలకు పెంచామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులలో కార్పోరేట్ స్థాయి వైద్యం అందాలని, అన్ని అసుప్రతులలో డైట్, శానిటేషన్, డ్రగ్స్ కొరత లేకుండా ఉంచాలని ఏ ఒక్క పేషంట్ కూడా బయట మందులు కొనుగోలు చేయకుండా ఉండాలని అలాగే రోగులకు సర్కార్ దవఖానాల పై విశ్వాసం పెరగాలని అన్నారు. ప్రభుత్వం ఇటీవల స్టాఫ్ నర్సులకు ఉద్యోగాలు అందించిందని త్వరలో వైద్యాధికారుల నియామకాలు చేపట్టుట జరుగుతుందని అన్నారు. సూర్యాపేటలో మెడికల్ కళాశాల సమస్యను త్వరలో పరిష్కరించి శంకుస్థాపన చేయడం జరుగుతుందని ఈ సందర్బంగా మంత్రి తెలిపారు.
పేదల ప్రభుత్వంలో పేద, నిరుపేద లకు కార్పోరేట్ స్థాయి వైద్య సేవలు అందాలని ఆదిశగా వైద్యాధికారులు బాధ్యతాయుతంగా సేవాలందించాలని సూచించారు. బుధవారం స్థానిక 14 వార్డులో పాత రూ. 26 కోట్లతో చేపట్టే 100 పడకల ప్రాంతీయ వైద్య శాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా రాష్ట్ర వైద్య శాఖ మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ సంకల్పం అర్హులైన పేదలకు మెరుగైన వైద్యం అందాలని హైదరాబాద్ తరహాలో జిల్లాలోని సూర్యాపేట, హుజూర్ నగర్, కోదాడ లలో అందాలని అలాగే ప్రతి PHC లలో మందుల కొరత ఉండకుండా చూడాలని సూచించారు. హుజూర్ నగర్, కోదాడ లలో చెరో చోట సిటీ స్కాన్,టిఫా అల్ట్రా సౌండ్ లను మంజూరు చేస్తున్నట్లు వారంలో ఏర్పాటు చేయాలని సూచించారు. తదుపరి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కోదాడ, హుజూర్ నగర్ నియోజక వర్గాల్లో పేదలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందించాలని పేదలకు, నమ్మకం, విశ్వసం పెరగాలని వైద్యులు ఆదిశగా సేవాలందించాలని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో రెడ్ల కుంట గ్రామానికి కింద 5 వేల ఎకరాల సాగుకు రూ.47 కోట్లు మంజూరు చేసి టెండర్లు పిలిచామని త్వరలో లిఫ్ట్ ప్రారభించుకుంటాని మరికొన్ని లిఫ్ట్ ల మరమ్మతులకు కూడా నిధులు మంజూరు చేశామని తెలిపారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ గతంలో మంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సాగు నీరు అలాగే రోడ్లు కు ఎక్కువ ప్రాధాన్యత కల్పించామని ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలు తప్పక అమలు చేస్తామని పేర్కొన్నారు. ఆసుపత్రిల వారీగా వసతుల కల్పనపై సమీక్షించారు. ఈ సమావేశంలో ప్రిన్సిపాల్ సెక్రటరీ క్రిష్టినా, కమిషనర్ అజయ్, డైరెక్టర్ ఆర్.వి. కర్ణన్, జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్, అదనపు కలెక్టర్లు సి.హెచ్. ప్రియాంక, ఏ. వెంకట్ రెడ్డి, కోటా చలం, ఏరియా ఆసుపత్రుల పర్యవేక్షకులు మురళీధర్ రెడ్డి, కరుణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ లు, జడ్పీటీసీ లు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.