ఏఎంసీతో పాటు ఏడు ఆస్పత్రులకు రూ.10.15 కోట్ల మంజూరు
ఈ నెల 15 నుంచి పనుల ప్రారంభానికి సన్నాహాలు
విశాఖపట్నం : మునుపెన్నడూ లేని విధంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైద్య, ఆరోగ్య
రంగానికి అధిక ప్రాధాన్యమిస్తోంది. ఇప్పటికే వైద్య నిపుణుల నియామకంతో పాటు
మౌలిక వసతుల కల్పన చేపట్టింది. గత నాలుగేళ్లలో ప్రభుత్వ ఆస్పత్రులను నాడు–నేడు
పథకం కింద కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా తీర్చిదిద్దింది. తాజా ఆస్పత్రుల్లో
మౌలిక సదుపాయాల కల్పన, శిథిల భవనాల మరమ్మతులకు భారీగా నిధులు మంజూరు చేసింది.
దీంతో విశాఖ నగరంలో ప్రభుత్వ ఆస్పత్రులకు మహర్దశ పట్టనుంది.
రూ.10.15 కోట్లు మంజూరు : నగరంలోని ఆంధ్ర వైద్య కళాశాల(ఏఎంసీ)తో పాటు పలు ఏడు
ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధికి ప్రభుత్వం రూ.10.15 కోట్లు మంజూరు చేసింది. ఈ
నిధులతో ఆంధ్ర వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న కేజీహెచ్తో పాటు ప్రభుత్వ
విక్టోరియా ఆస్పత్రి(ఘోషాస్పత్రి), ప్రాంతీయ కంటి ఆస్పత్రి, రాణి చంద్రమణి
దేవి ఆస్పత్రి(ఆర్సీడీ), విమ్స్, ఈఎన్టీ, ప్రభుత్వ ఛాతి ఆస్పత్రుల్లో
మరమ్మతులు, మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. నిధుల వినియోగానికి పరిపాలనా
అనుమతులు కూడా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి
సంస్థ(ఏపీ ఎంఎస్ఐడీసీ) ఇంజినీరింగ్ అధికారులు ఈ పనులకు టెండర్లు పిలిచారు.
త్వరలో టెండర్లు ఖారారు చేయనున్నారు. ఈనెల 15వ తేదీ నుంచి పనులు
ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
నిధుల కేటాయింపు ఇలా
ఆస్పత్రి కేటాయించిన నిధులు
కేజీహెచ్ రూ.3.10 కోట్లు
ఏఎంసీ రూ.1.05 కోట్లు
ఘోషాస్పత్రి రూ.1.32 కోట్లు
విమ్స్ రూ.2.5 కోట్లు
ఆర్సీడీ రూ.83 లక్షలు
కంటి ఆస్పత్రి రూ.60 లక్షలు
టీబీ ఆస్పత్రి రూ.40 లక్షలు
ఈఎన్టీ ఆస్పత్రి రూ.35 లక్షలు