మహిళా ఉద్యోగినిలకు కూడా ఐదు రోజులు ప్రత్యేక సెలవును వర్తింప చేయాలి
పార్ట్ టైమ్ అని కాకుండా “ఫుల్ టైమ్” టీచర్స్ గా మార్చాలి
సర్వ శిక్ష అభియాన్స్టే ట్ అడిషనల్ ప్రోజక్ట్ డైరక్టర్ బి. శ్రీనివాసరావు ని
కలిసిన ఆంధ్రప్రదేశ్ వర్క్, ఆర్ట్ & పి ఇ టి ఇన్స్ట్రక్టర్ యూనిటీ వెల్ఫేర్
అసోసియేషన్
వెలగపూడి : ఏపి జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు , సెక్రెటరీ
జనరల్ వై. వీ రావు ఆధ్వర్యంలో ప్రభుత్వ హై స్కూల్స్ లలో పార్ట్ టైం పనిచేసే
సమగ్ర శిక్ష వర్క్, ఆర్ట్, పిఇటి ఇన్స్ట్రక్టర్ ల పక్షాన “ఆంధ్రప్రదేశ్
వర్క్, ఆర్ట్ & పి ఇ టి ఇన్స్ట్రక్టర్ యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్”
అధ్యక్షురాలు సైకం శివకుమారి రెడ్డి వారి బృందం అందరూ సర్వ శిక్ష అభియాన్
(యస్ యస్ ఏ) స్టేట్ అడిషనల్ ప్రోజక్ట్ డైరక్టర్ బి. శ్రీనివాసరావు ని కలిసి,
ప్రధానమైన సమస్యలను పరిష్కారించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి నెల డ్యూటీ
సర్టిఫికేట్ హెడ్ మాస్టర్ ఇచ్చినప్పటికీ, తప్పక ఎంఈఓ సంతకాలతో ఇస్తే తప్ప
తమకు జీతాలు చెల్లించడం లేదని, కనుక హెడ్ మాస్టర్ సంతకంతో జీతాలు
చెల్లించే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. సాధారణ ఉద్యోగుల వలే, సమగ్ర
శిక్ష వర్క్, ఆర్ట్, పిఇటి ఇన్స్ట్రక్టర్ లకు కూడా “మెడికల్ లీవ్స్” వర్తింప
చేయాలని కోరారు. సాధారణ మహిళా ఉద్యోగినులకు వలే, సమగ్ర శిక్ష వర్క్, ఆర్ట్,
పిఇటి ఇన్స్ట్రక్టర్ మహిళా ఉద్యోగినిలకు కూడా “ఐదు రోజులు ప్రత్యేక సెలవును
వర్తింప చేయాలని కోరారు. ఇంతవరకు ఇ పి ఫ్ గానీ, ఇ ఎస్ ఐ గానీ లేకపోవటం చాలా
బాధాకరమని, వెంటనే జోక్యం చేసుకొని వారికి “ఇ ఎస్ ఐ & ఇ పి ఫ్” లు వర్తింప
చేయాలన్నారు.
సమగ్ర శిక్ష వర్క్, ఆర్ట్, పిఇటి ఇన్స్ట్రక్టర్ లకు ఇప్పటివరకు బదిలీలు
అవకాశం ఇవ్వనందున, ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, దయచేసి అవకాశం
వున్నంత మేరకు వదిలీ అవకాశం కలుగ చేయాలని కోరారు. గత ఐదు సంవత్సరాలుగా జీతాలు
పెంచలేదని, అలాగే ప్రభుత్వం టీచర్లకు టైం స్కేల్ ఇవ్వమని ప్రభుత్వ ఉత్తర్వులు
(జీవో-42) స్పష్టంగా ఉన్నప్పటికీ, ఇప్పటికీ 14 వేల జీతం మాత్రమే ఇస్తున్నారని,
తక్షణమే ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు “టైం స్కేల్” ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
పార్ట్ టైమ్ ఉద్యోగులుగా నియమించినప్పటికి పూర్తికాలం టీచరు గా కాకుండా
పార్ట్ టైం టీచర్ల స్కూల్ లోనే వుంటూ పనిచేస్తున్నారని, పార్ట్ టైమ్ అని
కాకుండా “ఫుల్ టైమ్” టీచర్స్ గా మార్చమని కోరారు.
అన్ని విషయాలను సావధానంగా విన్న స్టేట్ అడిషనల్ డెరైక్టర్ , సమగ్ర శిక్ష
వర్క్, ఆర్ట్, పిఇటి ఇన్స్ట్రక్టర్ లకు సంబంధిత అధికారుల్ని పిలిపించి
అడుగుతున్న అంశాలు వాస్తవంగానే వున్నాయని, సమస్యలపై సానుకూలంగా స్పందించారు.
తప్పకుండా వీలైనంత త్వరలో మన సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు.
ప్రధానంగా ఉద్యోగులకు ఇ పి ఫ్, ఇ ఎస్ ఐ లేకపోవటం సమంజసం కాదని, సంబంధిత
అధికారిని పిలిపించి వెంటనే వారందరికీ ఇ పి ఫ్ , ఇ ఎస్ ఐ వర్తింప చేయడానికి
ఎలాంటి నిబంధలు ఉంటే, వాటి ప్రకారం చేసేవిధంగా చర్యలు తీసుకోమని , అలాగే
వారి జీతాలు పెరిగి 5 సంవత్సరాలు దాటింది కాబట్టి ఈసీ మీటింగ్ లో చర్చించి
ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
పార్ట్ టైమ్ నుండి ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ గా మార్పు చేసే విషయంపై సమావేశంలో
చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపి జేఏసీ
అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు , ఏపి జేఏసీ అమరావతి సెక్రటరీ జనరల్
వై వి రావు, ఏ.పి.అర్.ఎస్.ఏ కోశాధికారి గిరికుమార్ రెడ్డి, సైకం శివకుమారి
రెడ్డి, విఅర్ఓ సంఘం తదితరులు పాల్గొన్నారు.