విజయవాడ : గత కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రత్యేకంగా క్యాష్ డీల్
చేసే వాళ్ళు, రెవెన్యూ వసూలు చేసే అన్నీ శాఖల ఉద్యోగులు డ్యూటీలో ఉండగా, ఏసీబీ
తదితర తనిఖీ అధికారుల తనిఖీ సమయంలో, ఉద్యోగి వద్ద పర్సనల్ క్యాష్ రూపేణా
కేవలం 500 రూపాయలు మాత్రమే ఇప్పటివరకు ప్రభుత్వం నుండి అనుమతి ఉన్నది.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఉద్యోగి తన వ్యక్తి కనీస అవసరాలకు అనగా
మధ్యాహ్నం భోజనం, వాహనానికి ఆయిల్ (ఉదాహరణకు తహశీల్దార్ తత్సమాన అధికారులు
ఉపయోగించే కేవలం ఒక్క అద్దె వాహనానికే ఆయిల్ కు కనీసం 3000 దగ్గర ఉండాలి),
అత్యవసర ఆఫీస్ ఖర్చులు, మందులు తదితర ఖర్చులకు ఈ రోజుల్లో కనీసం 5000 లు
ఉండాలని గత మూడు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్
పక్షాన కోరగా ప్రభుత్వం ఉత్తర్వులు ద్వారా, తనిఖీ సమయంలో ఉద్యోగి వద్ద
పర్సనల్ క్యాష్ రూపేణా 500 నుండి 1000 లకు పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వడం
జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనేక సమావేశాలలో ప్రధానంగా ఇటీవల అనేక
మంత్రి వర్గ ఉపసంఘం సమావేశాలలో కూడా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్
అసోసియేషన్ పక్షాన ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ తక్షణమే ఆఫీసర్స్ పర్సనల్ క్యాష్
ను పెంచాలని డిమాండ్ చేయగా ఈ రోజు జీ ఓ 162 ద్వారా 1,000 రూపాయలకు పెంచుతూ
ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వటాన్ని ఆహ్వానిస్తూ ప్రభుత్వానికి బొప్పరాజు
వెంకటేశ్వర్లు,
చేబ్రోలు కృష్ణమూర్తి కృతజ్ఞతలు తెలిపారు.