విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల
సమస్యలను పరిష్కరించాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం కోరింది. రాష్ట్రంలో
పనిచేస్తున్న చాలామంది ఉద్యోగులకు ఇప్పటికీ జీతాలు పడకు చాలా ఇబ్బందులకు
గురవుతున్నారని, ముఖ్యంగా అతి తక్కువ జీతాలతో సుమారు రెండున్నర సంవత్సరాలు
నుండి 15000 లుతో పని చేస్తున్న గ్రేడ్ 2 వీఆర్వోలు చాలా ఆందోళన
చెందుతున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర
అధ్యక్షులు. భూపతి రాజు రవీంద్ర రాజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం
అప్పలనాయుడు వాపోయారు. ఓ వైపు 15000 జీతంతో కుటుంబం గడపలేక ఆర్థిక ఇబ్బందులు
పడుతూ మరోపక్క ప్రొబిషన్ డిక్లేర్ చేస్తే 30,000 వస్తుందని ఆశపడుతున్న
వారందరికీ, ఒకపక్క అధికారులు సహకరించడం లేదన్నారు. ఇప్పుడు కనీసం నెల జీతం 15
వేల రూపాయలు కూడా జీతాలు రాలేదని తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు.
ముఖ్యమంత్రి వెంటనే ఉద్యోగుల సమస్యలపై శ్రద్ధ చూపి ఉద్యోగ సంఘాలతో మీరే
స్వయంగా చర్చించి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ
రెవెన్యూ అధికారుల సంఘం తరపున కోరారు. గ్రేడ్ 2 వీఆర్వోల పొబిషన్ కూడా
డిక్లేర్ చేసి వారందరికీ వెంటనే పే స్కేల్ అమలు అయ్యేలాగా ఉన్నతాధికారులకు
కూడా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వంలో
భాగమైన కానీ వారి సమస్యలు పరిష్కారం కావడం లేదని, ప్రభుత్వంపై వ్యతిరేకత
వ్యక్తం చేస్తున్నందున, పరిస్థితి చేయి జారకముందే చర్యలు చేపట్టి ఉద్యోగుల
సమస్యలు పరిష్కరిస్తారని ముఖ్యమంత్రినిఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ
అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపతి రాజు రవీంద్ర రాజు రాష్ట్ర ప్రధాన
కార్యదర్శి ఎం అప్పల నాయుడు కోరారు.