గుంటూరు : నాయిబ్రాహ్మణులకు ప్రయోజనాలు కలిగించే విధంగా ముఖ్యమంత్రి వైయస్
జగన్ నిర్ణయాలు తీసుకోవడం పట్ల నాయిబ్రాహ్మణులలో హర్షం వ్యక్తం ఆవుతోంది.
దేవస్ధానాల పాలకమండళ్ళలో సభ్యులుగా నాయిబ్రాహ్మణుల ఉండేలా ఆర్డినెన్స్
3,కల్యాణ కట్టలు ఉన్న దేవాలయాలలో కనీస వేతనం 20 వేల రూపాయలుగా నిర్ణయం
తీసుకుంటూ జిఓ నెంబర్ 110 జారీచేశారు. దీనిని పురస్కరించుకుని రాష్ట్ర
నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సిద్దవటం యానాదయ్య, దేవాదాయాల కేశకండనశాల
జెఏసి రాష్ట్ర అధ్యక్షుడు గుంటుపల్లి రామదాసులు నేతృత్వంలో నాయిబ్రాహ్మణ నేతలు
ఏపి ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి ని కలసి కృతజ్ఞతలు
తెలియచేశారు. ప్రభుత్వ నిర్ణయాలు నాయిబ్రాహ్మణులకు వారి కుటుంబాలకు ఎంతో
ప్రయోజనం కలిగిస్తాయని అన్నారు.తమ సమస్యలను సానుకూలంగా పరిష్కరించిన
ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారికి ఎప్పుడూ రుణపడిఉంటామని వారు అన్నారు. ఈ
సందర్భంగా ఏపి ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ
దశాభ్దాలు తరబడి నాయిబ్రాహ్మణుల డిమాండ్లను పరిష్కారం చేయడం ముఖ్యమంత్రి
జగన్ మోహన్ రెడ్డి చిత్తశుద్దికి నిదర్శనం అని అన్నారు. ఎస్సి, ఎస్టి, బిసి,
మైనారిటీలకు ప్రయోజనం కలిగించే ఏ నిర్ణయం అయినా తీసుకునేందుకు ప్రభుత్వం
సిధ్దంగా ఉంటుందని స్పష్టం చేశారు. సజ్జల రామ కృష్ణారెడ్డిని కలిసిన వారిలో
నాయిబ్రాహ్మణ జేఏసి ఉపాద్యక్షుడు ఆర్. వి.రమణ, కోశాధికారి ఏజిఎల్ నారాయణ,
రాష్ట్ర మహిళా కార్యధర్శ నందిని రాజ్ కుమార్,సంతోష్ ,లోవా అద్యక్షుడు రాము,
చెల్లారావు వివిధ దేవాలయాల నాయకులు పాల్గొన్నారు.