వెంకటగిరి ….వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
వెంకటగిరి పట్టణం త్రిభువని సెంటర్ నందు మీ సేవ కేంద్రానికి పక్కన ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిగ చాలా కాలంగా ఉంది, కానీ ప్రస్తుతము పరిణామాల దృష్ట్యా ఆ భూమిని కొందరు వ్యక్తులు ప్రైవేటు భూమిగా అనుకుని సదరు భూమిని ఆక్రమణలు చేశారు, దీనిపై తక్షణమే విచారణ జరిపించి ప్రభుత్వ భూమిని అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని.. వెంకటగిరి మండల తాసిల్దార్ మరియు వెంకటగిరి మున్సిపల్ కమిషనర్ వినతి పత్రం ద్వారా వెంకటగిరి ప్రథమ పౌరురాలు మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి నక్కా భానుప్రియ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ నక్కా వెంకటేశ్వరరావు అందజేయడం జరిగిందిఈ కార్యక్రమంలో భాగంగా వైస్ చైర్మన్ బాలయ్య, 17వ వార్డ్ కౌన్సిలర్ పూజారి లక్ష్మీ విప్, 3వ వార్డ్ కౌన్సిలర్ ప్రభావతి, 4వ వార్డ్ కౌన్సిలర్ నారాయణ, 9వ వార్డ్ కౌన్సిలర్ కళ్యాణి, 14వ వార్డ్ కౌన్సిలర్ శంకరయ్య, 18వ వార్డ్ కౌన్సిలర్ విజయ లక్ష్మి, 19వ వార్డ్ కౌన్సిలర్ వహీదా, వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు చింతపట్ల మురళి, తూపటి చెంచయ్య, పూజారి శ్రీను పాల్గొన్నారు