ఉత్తరాఖండ్ సీఎం]పుష్కర్ సింగ్ ధామీ పరామర్శ..
రోడ్డుపై ఉన్న గుంతలే తన కారు ప్రమాదానికి కారణమని వికెట్ కీపర్, బ్యాట్స్మన్
రిషబ్ పంత్ వెల్లడించినట్టు సమాచారం. డెహ్రాడూన్లోని మ్యాక్స్ హాస్పిటల్లో
ఆదివారం తనను కలిసిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీకి పంత్ ఈ
మేరకు సమాచారం అందించాడు. 25 ఏళ్ల ఈ క్రికెటర్ డిసెంబర్ 30న ఢిల్లీ నుంచి
రూర్కీకి వెళ్తుండగా మెర్సిడెస్ కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైన విషయం
తెలిసిందే. కాగా, ప్రస్తుతం పంత్ ఆరోగ్యం చాలా మెరుగుపడిందని ముఖ్యమంత్రి
పుష్కర్ సింగ్ ధామీ తెలిపారు. పంత్ తదుపరి చికిత్సకు సంబంధించి
బీసీసీఐ, వైద్యులు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన చెప్పారు.