హైదరాబాద్ : తెలుగుదనాన్ని, సంస్కృతి, సాంప్రదాయాలను అణువణువునా
ప్రతిబింబించేలా అద్భుతమైన సినిమాలు అందించిన కళాతపస్వి, ప్రముఖ దర్శకులు
కె.విశ్వనాథ్ మృతి బాధాకరం అని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్
రావు తన సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని
తెలియజేశారు. విశ్వనాథ్ గారిని కోల్పోవడం తెలుగు ప్రేక్షకులకి, సినీ పరిశ్రమకు
తీరని లోటు అన్నారు. చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే దాదా
సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న విశ్వనాథ్ గారు, తెలుగు సినిమాల గొప్పతనాన్ని
అంతర్ జాతీయ వేదికలపైకి చేర్చారని కొనియాడారు. తెలుగు సినిమా ఉన్నంత వరకు ఆయన
పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుందని పేర్కొన్నారు.