హైదరాబాద్ : తెలుగు సినిమా పరిశ్రమ ప్రముఖ దర్శకులు, బహుముఖ ప్రజ్ఞాశాలి, కళా
తపస్వి కే. విశ్వనాథ్ మృతి చెందడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్
బోయినపల్లి వినోద్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సినీ కళామతల్లి
ముద్దుబిడ్డ, అనేక చారిత్రాత్మమైన , సమాజానికి సందేశాత్మక చిత్రాలను అందించిన
దర్శకులు విశ్వనాథ్ మన మధ్య ఇక లేరంటే జీర్ణించుకోవడం కష్టమని వినోద్ కుమార్
పేర్కొన్నారు.విశ్వనాథ్ మరణం యావత్ చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు అని వినోద్ కుమార్
అన్నారు. విశ్వనాథ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు
వినోద్ కుమార్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.