విజయవాడ : నిజాం స్టేట్ రైల్ అండ్ రోడ్డు ట్రాన్స్ పోర్ట్ సంస్థ కు చెందిన
తొలితరం అల్బియాన్ (డెక్కన్ క్వీన్) పాసింజర్ బస్సు ఆవిష్కరణ కార్యక్రమానికి
రవాణా శాఖ సెక్రటరీ ప్రద్యుమ్న , ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ సిహెచ్. ద్వారకా తిరుమల
రావు హాజరై విజయవాడ పండిట్ నెహ్రు బస్సు స్టేషన్ కు ప్రక్కనే ఉన్న సిటీ బస్
టెర్మినల్ వద్ద, విజయవాడ డిపోలో పనిచేసి రిటైరైన ఇద్దరు సీనియర్ డ్రైవర్లతో
రిబ్బన్ కట్ చేయించి ఆవిష్కరింపజేశారు. అప్పటి వారి అనుభవాలను, ఈ బస్సు
తాలూకు జ్ఞాపకాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఇరువురూ తొలి తరం అల్బియాన్ (డెక్కన్ క్వీన్) పాసింజర్ బస్సు లోపలి
సీటింగ్ అమరికను, కిటికీ నమూనాలను పరిశీలించారు. డ్రైవింగ్ సీటులో కూర్చుని,
స్టీరింగ్ ని పట్టుకుని అటూ, ఇటూ తిప్పుతూ ఆనందించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ
ఎం.డి సిహెచ్. ద్వారకా తిరుమల రావు మాట్లాడుతూ విజయవాడ బస్సు స్టేషన్ మీదుగా
రాకపోకలు సాగించే ప్రయాణికులందరికీ, ఈ పురాతన బస్సు కనబడేలా సిటి పోర్టులో
ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. బస్సు స్టేషన్ లోపల భద్రపరిస్తే
ఎక్కువమంది చూసే వీలుండదని, విశాలమైన సిటీ బస్సు పోర్టులో ఉంచడం వలన ప్రతి
ఒక్కరికీ కనువిందు చేస్తుందని భావించి, ఈ ప్రదేశంలో ఏర్పాటు చేసినట్లు
తెలిపారు. ఇప్పటి తరం ప్రజలకు, ప్రయాణికులకు తొలి తరం బస్సు విశేషతను గుర్తు
చేసే విధంగా ఆర్టీసీ ఈ ఏర్పాటు చేసిందని, ఇది పర్యాటకులకు, ప్రయాణికులకు
కనువిందు చేస్తుందని తెలిపారు. ఆనాటి నిజాం యువరాణి జహీరా బేగం ప్రయాణికుల
కోసం ఈ బస్సుని సొంత ఖర్చులతో కొనుగోలు చేయడం వలన ఆమె పేరు లోని మొదటి అక్షరం
జడ్ ని ఇప్పటికీ ప్రభుత్వ బస్సుల రిజిస్ట్రేషన్ గా చేసారని తెలిపారు.

ప్రస్తుతం ఇలాంటి బస్సులు 2 మాత్రమే ఉండగా, వాటిలో ఒకటి హైదరాబాద్ ఆర్టీసీహెడ్ క్వార్టర్స్ నందు కలదు. విజయవాడ మీదుగా చాలా మంది ప్రయాణికులు వివిధ
రాష్ట్రాలకు, ప్రాంతాలకు రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు. అలనాటి బస్సు వైభవాన్ని
గుర్తుకు తెచ్చేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించి విజయవాడకు తరలించారు. “ఇది
ఆర్టీసీ చరిత్రకు సాక్ష్యం, భవిష్యత్తు తరాల కోసం దీన్ని భద్రపరచి,”
ప్రయాణికులను ఆకట్టుకునేలా ప్రదర్శించాలనే ఉద్దేశ్యంతో సంస్థ ఎం.డి సి.హెచ్.
ద్వారకా తిరుమల రావు ప్రత్యేక చొరవ తీసుకుని ఈ డెక్కన్ క్వీన్ బస్సును
పి.ఎన్.బి.ఎస్. సిటీ బస్ టెర్మినల్ వద్ద ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1952 లో ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. గా
ఆవిర్భవించి, ప్రపంచంలోనే అతి పెద్ద రోడ్డు రవాణా సంస్థగా పేరుగాంచి గిన్నిస్
బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పేరు సాధించడమే కాకుండా ఎన్నో అవార్డులు,
రివార్డులు కూడా సొంతం చేసుకొంది.