హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ అన్ని రంగాల్లో
పురోగమిస్తోందని, ప్రవాసులు దానికి మరింత ఊతమివ్వాలని భారాస ఎమ్మెల్సీ, భారత్
జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కోరారు. స్వదేశానికి వచ్చి తెలంగాణలో
పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో
శనివారం భారత్ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన బోనాల ఉత్సవాల్లో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేళ్లలోనే రాష్ట్ర ప్రజల
ఆకాంక్షలు నెరవేరాయి. దేశంలో రెండు ఐటీ ఉద్యోగాలు ఉంటే అందులో ఒకటి
తెలంగాణలోనే ఉంది. తెలంగాణ సంప్రదాయాలను ప్రవాసులు ప్రపంచ దేశాలకు
విస్తరిస్తున్నారు. ఆస్ట్రేలియా రాజకీయాల్లోనూ రాణిస్తుండడం గర్వకారణం’’ అని
కవిత తెలిపారు. అంతకుముందు అక్కడి తెలంగాణవాసుల కుటుంబాలను సందర్శించిన కవిత
వారి ఇళ్లలో బోనాలను అలంకరించారు. భారత్ జాగృతి ఆస్ట్రేలియా విభాగం
అధ్యక్షుడు శ్రీకర్‌రెడ్డి, భారాస ఆస్ట్రేలియా విభాగం అధ్యక్షుడు కాసర్ల
నాగేందర్‌రెడ్డి, బ్రిస్బేన్ తెలంగాణ సంఘం అధ్యక్షుడు కిషోర్ తదితరులు
పాల్గొన్నారు.