దర్శకుడిగా ఇప్పుడు ప్రశాంత్ నీల్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా
చెప్పుకోవలసిన పనిలేదు. ఆయన సత్తాను గురించి ‘కేజీఎఫ్ 1’ .. ‘కేజీఎఫ్ 2’
సినిమాలు చెప్పేస్తాయి. ఆయన తాజా చిత్రంగా ‘సలార్’ సెట్స్ పై ఉంది. ప్రభాస్ –
శ్రుతి హాసన్ జంటగా నటిస్తున్న ఈ సినిమా, ఈ సెప్టెంబర్ 28వ తేదీన విడుదల
కానుంది.ఆ తరువాత ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు ఉండనుంది. అందుకు సంబంధించిన
సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. కొరటాలతో చేయనున్న సినిమా పూర్తికాగానే
ఎన్టీఆర్ సెట్స్ పైకి వెళ్లేది ప్రశాంత్ నీల్ తోనే. ఇది కూడా పాన్ ఇండియా
మూవీనే కావడం విశేషం. ఈ సినిమాతో ఎన్టీఆర్ గ్రాఫ్ నెక్స్ట్ లెవెల్లో దూసుకుని
వెళుతుందని అంటున్నారు.

ఇక ఈ నేపథ్యంలోనే అఖిల్ ను కూడా ప్రశాంత్ నీల్ లైన్లో పెట్టేశాడనే టాక్ బలంగా
వినిపిస్తోంది. అఖిల్ కి పాన్ ఇండియా సినిమా పడాలనే ఆలోచనలో నాగార్జున
ఉన్నారు. అదే సమయంలో హోంబలే సంస్థ వారు ప్రశాంత్ నీల్ తో మరో భారీ ప్రాజెక్టు
చేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు. దాంతో ఈ ప్రాజెక్టును అఖిల్ తో
చేయనున్నట్టుగా సమాచారం. ఇక ఏప్రిల్ 28న అఖిల్ ‘ఏజెంట్’ సినిమాతో పలకరించనున్న
సంగతి తెలిసిందే.