పీసీబీ ప్రకటనతో తొలగిన అపోహలు
పాకిస్థాన్, ఇంగ్లండ్ మధ్య మొదటి క్రికెట్ టెస్ట్‌కు ముందు చాలామంది ఆటగాళ్ళు
అస్వస్థతకు గురైనప్పటికీ, అనుకున్నట్లుగా ఆట గురువారం ప్రారంభమైంది. ఈ విషయమై
మ్యాచ్ ప్రారంభ సమయానికి రెండు గంటల ముందు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(
పీసీబీ) గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. తమ క్రికెటర్లు ఆరోగ్యంగా
ఉన్నారని, మ్యాచ్ కు మేం సిద్దంగా ఉన్నామని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తెలపడంతో
మ్యాచ్ పై అపోహలు తొలగిపోయాయని పీసీబీ వెల్లడించింది.