అధ్యక్షుడు బైడెన్ తనదైన శైలిలో స్పందించారు. ఆయనపై విషప్రయోగం
జరగొచ్చేమోనంటూ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ప్రిగోజిన్ చేసిన తిరుగుబాటు, ఆ
తర్వాత పరిణామాలను ఉద్దేశించి బైడెన్ ఈ విధంగా స్పందించారు. ‘ప్రిగోజిన్
ఎక్కడున్నారో అమెరికాకు తెలీదు. అతడి స్థానంలో నేనుంటే, నేను తీసుకునే ఆహారం
విషయంలో జాగ్రత్తగా ఉంటాను. నా మెనూపై ఓ కన్నేసి ఉంచుతాను’ అంటూ ప్రిగోజిన్పై
విష ప్రయోగం జరగొచ్చేమోనని సందేహాన్ని వ్యక్తం చేశారు. ‘ఇక సరదా మాటలన్నీ
పక్కన పెడితే రష్యాలో ప్రిగోజిన్ భవిష్యత్తు ఏంటో ఎవరికీ తెలీదని నేను
భావిస్తున్నానని అన్నారు. రష్యా సైన్యంతో కలిసి ఉక్రెయిన్ యద్ధంలో
పోరాడుతోన్న వాగ్నర్ గ్రూప్ జూన్ 24న తిరుగుబాటుకు దిగిన విషయం తెలిసిందే.
బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో మధ్యవర్తిత్వంతో ఈ తిరుగుబాటు ఆగిపోయింది. దీని
తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్- ప్రిగోజిన్ మధ్య చర్చలు జరిగాయి. తర్వాత
పుతిన్ ఓ పత్రికతో మాట్లాడుతూ వాగ్నర్ పీఎంసీ అనేది లేదు. మా చట్టాలు
ప్రైవేట్ సైన్యాలకు అనుమతి ఇవ్వవు. వాస్తవానికి వాగ్నర్ గ్రూపు ఉంది. కానీ
చట్టం దృష్టిలో అటువంటి సంస్థ లేదని పేర్కొన్నారు. మరోవైపు ప్రిగోజిన్పై విష
ప్రయోగం జరగొచ్చని గతంలోనూ ఊహాగానాలు వినిపించాయి. ఈ క్రమంలోనే బైడెన్ దీనిపై
స్పందించడం గమనార్హం.
ప్రిగోజిన్పై విష ప్రయోగం జరగొచ్చేమో : బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వాషింగ్టన్ : వాగ్నర్ గ్రూప్ అధినేత ప్రిగోజిన్ భవితవ్యంపై అమెరికా