ప్రియురాలిని హత్య చేసి, ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికి, చట్టాల బారి నుంచి
తప్పించుకునేందుకు ఢిల్లీ అంతటా చెల్లాచెదురుగా పడేశాడనే అభియోగంతో శనివారం ఓ
వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి మిస్సింగ్ కేసును ఛేదించారు. వారి కధనం
ప్రకారం వివరాలిలా వున్నాయి.. అఫ్తాబ్ అనే వ్యక్తి తన ప్రియురాలు
శ్రద్ధా(26)ను మే 18న గొడవ అనంతరం గొంతు నులిమి చంపాడు. తరువాత ఆమె శరీరాన్ని
35 ముక్కలుగా నరికేశాడు. వాటిని ఉంచడానికి తగిన సైజు గల ఫ్రిడ్జ్ కొనుగోలు
చేశాడు. వాటిని అందులో వుంచి ఢిల్లీ అంతటా ఒక్కొక్కటిగా విసిరివేశాడు.
శ్రద్ధా, అఫ్తాబ్ ముంబైలోని ఓ కాల్ సెంటర్లో పనిచేశారు. అక్కడ వారు ప్రేమలో
పడ్డారు. అయితే, ఆమె కుటుంబం వీరి ప్రేమను వ్యతిరేకించడంతో.. ఢిల్లీకి
పారిపోయారు. శ్రద్ధా కుటుంబ సభ్యులకు సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ ద్వారా ఆమె
ఆచూకీ తెలిసింది. అయితే అప్ డేట్స్ ఆగిపోవడం గమనించిన ఆమె తండ్రి ఢిల్లీ
వెళ్లి వెతకడం ప్రారంభించాడు. లాభం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తనను పెళ్లి చేసుకోవాలని శ్రద్దా ఒత్తిడి చేయడంతోనే ఆమెను హత్య చేశానని
అఫ్తాబ్ అంగీకరించడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై తరచూ
ఇద్దరూ గొడవపడేవారని, విషయం బయటకు పొక్కడంతో మే నెలలో ఆమెను చంపేశానని అఫ్తాబ్
అంగీకరించాడు. తొలుత శ్రద్ధాను గొంతు నులిమి చంపిన అఫ్తాబ్ ఆ తర్వాత ఆమె
శరీరాన్ని ముక్కలుగా నరికి ఢిల్లీ అంతటా ఒక్కొక్కటిగా విసిరివేసినట్లు పోలీసు
వర్గాలు తెలిపాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రద్దా మృతదేహం కోసం
గాలిస్తున్నారు.