ఉపయోగిస్తున్నారు. రకరకాల రంగుల్లో రకరకాల బొమ్మల మోడల్స్ లో ప్లాస్టిక్
బాటిల్స్ వస్తున్నాయి. రకరకాల రంగులో రకరకాల బొమ్మల మోడల్స్ లో ప్లాస్టిక్
బాటిల్స్ వస్తున్నాయి. తక్కువ ధరకే వస్తున్నాయి కాబట్టి చిన్నపిల్లలు,
పెద్దవారు ప్లాస్టిక్ బాటిల్స్ ను మంచినీళ్లు తాగడానికి ఉపయోగిస్తున్నారు.
అయితే ప్లాస్టిక్ బాటిల్స్ లో మంచినీళ్లను తాగడం అంత మంచిది కాదు. ఇంకా
వేడినీళ్లను ప్లాస్టిక్ బాటిల్ లో పోసుకొని తాగడం అస్సలు మంచిది కాదు.
ఎందుకంటే ప్లాస్టిక్ బాటిల్ లో మామూలు వాటర్ ఎక్కువసేపు ఉంచినా మంచి నీళ్ళల్లో
కొద్దిగా ప్లాస్టిక్ కరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఇంకా వేడి నీళ్లను
ప్లాస్టిక్ బాటిల్ లో పోసుకుంటే ముందు ఆ వేడికి ప్లాస్టిక్ కరిగి నీళ్ళల్లో
కలిసిపోయి అది మన శరీరంలోనికి చేరుతుంది. ప్లాస్టిక్ బాటిల్స్ లో మంచినీళ్లను
తాగరాదు.
వేడి నీళ్లను ప్లాస్టిక్ బాటిల్స్ లో అస్సలు పోయకూడదు. దానివల్ల ఆ ప్లాస్టిక్
అవశేషాలు నీటిలో కలవడం వల్ల అనేక రకాల వ్యాధుల భారీన పడే అవకాశం ఉంది.
అంతేకాక కొన్ని సార్లు మరీ పల్చటి ప్లాస్టిక్ బాటిల్స్ అయితే వేడినీళ్లు
పొయ్యగానే అవి కరిగిపోయి బాటిల్స్ ముద్దగా తయారయి పాడైపోతాయి. కాబట్టి వాటర్
బాటిల్స్ స్టీల్ వి లేకపోతే రాగివి లేకపోతే లేదా గాజువి ఉపయోగిస్తే మన
ఆరోగ్యానికి మంచిది.
ప్లాస్టిక్ బాటిల్స్ వాడడం వలన పర్యావరణానికి నష్టం కలుగుతుంది. ఎందుకంటే అది
తొందరగా నేలలో కలవదు. ప్లాస్టిక్ బాటిల్స్ భూమిలో కలిసిపోవడానికి వందల
సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ను వాడడం తగ్గించాలి.
మనం వేరే వాటర్ బాటిల్స్ వాడినా వాటిని రెండు రోజులకు ఒకసారి ఉప్పు లేదా
వెనిగర్ వేసి వేడి నీళ్ళల్లో కడగాలి అప్పుడే బాటిల్స్ లో బ్యాక్టీరియా ఏమైనా
ఉంటే పోతుంది. ఇలా బాటిల్స్ క్లీన్ చేయడం వలన ఏమైనా వాసన ఉంటే కూడా పోతుంది.
ఇంకా ఫంగస్ వంటివి దరిచేరాకుండా ఉంటాయి.