విజయవాడ : గత మూడు సంవత్సరాల నుండి ఫారెస్ట్ రిజర్వ్ లో అక్రమ మైనింగ్ తవ్వకాలు చేస్తున్నారని మాజీ సైనికులు పిల్లి సురేంద్రబాబు అన్నారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలు నుండి ఫారెస్ట్ రిజర్వులో అక్రమ మైనింగ్ తవ్వకాలు జరుగుతున్నాయని ఈ విషయాన్ని మైలవరం ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లానని ఆయన నాకు తెలియదనే సమాధానం చెప్పారని తెలిపారు. ఎమ్మెల్యే కి తెలియకుండా మరి ఎవరికి తెలుసు అని మనం చెప్పారని ఆయన అన్నారు . రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు ఇక్కడ అవినీతి జరుగుతుందని మరి ఎవరు ప్రశ్నించారు ఎందుకని అని వారు ప్రశ్నిస్తున్నారు. మాకు అనేక బెదిరింపులు వస్తున్నాయి. మాకు ఏమి జరిగినా రాష్ట్ర ముఖ్యమంత్రి దే బాధ్యత అని అన్నారు. ఒక్క కొత్తూరు తాడేపల్లి మైనింగ్ లోనే 5వేల కోట్లు వస్తుంటే రాష్ట్రం మొత్తం మీద ఎంత అక్రమ ఆర్జన చేస్తున్నారు. తరువాత జిల్లా కలెక్టర్ సిపిని కలిసి వినతిపత్రం అందిస్తామన్నారు. వెంటనే దీనిపై ఒక జాయింట్ యాక్షన్ కమిటీ వేసి కేసు అప్పగించాలని డిమాండ్ చేశారు.