ఫిఫా ప్రపంచకప్ లో సంచలనం నమోదైంది. పసికూన సౌదీ అరేబియా చేతిలో లియోనల్
మెస్సీ లాంటి దిగ్గజ ఆటగాడున్న అర్జెంటినా 1-2తో ఓటమి పాలైంది. అర్జెంటినాను
ఓడించిన సౌదీ అరేబియా ఆటగాళ్ల ఆనందానికి అంతే లేకుండా పోయింది. దోహాలో హాట్
ఫేవరెట్‌గా బరిలోకి దిగిన మెస్సీ సేనను 51వ ర్యాంకర్ అయిన సౌదీ అరేబియా
ఓడించడం అందర్నీ షాక్ కు గురి చేసింది. మ్యాచ్ ఆరంభంలో లభించిన పెనాల్టీని
గోల్‌గా మార్చిన మెస్సీ ఖాతా తెరిచాడు. ఆ తర్వాత కూడా అర్జెంటినా ఆధిపత్యం
కొనసాగింది. తొలి సగం ముగిసే సరికి అర్జెంటినా 1-0తో ఆధిక్యంలో ఉంది. అయితే,
సెకండాఫ్‌లో మాత్రం సౌదీ దూకుడు ముందు అర్జెంటినా నిలవలేకపోయింది. ఒక దశలో ఇరు
జట్లు బంతిపై ఆధిపత్యం చలాయించడంతో గేమ్ హోరాహోరీగా జరిగింది. అయితే, 47వ
నిమిషంలో సౌదీ ఆటగాడు అల్ పెహ్రీ గోల్ సాధించడంతో స్కోర్లు 1-1తో సమమయ్యాయి.
దీంతో సౌదీ అరేబియా రెట్టించిన ఉత్సాహంతో ఆడింది. అదే జోరు ప్రదర్శిస్తూ
అర్జెంటినా డిఫెండర్లను ముప్పుతిప్పలు పెట్టింది. ఈ క్రమంలో 57వ నిమిషంలో
సలీమ్ అల్ దవాసరి గోల్ చేయడంతో ఆ జట్టు ఆధిక్యం 2-1కి పెరిగింది. ఆ తర్వాత
మరింత జాగ్రత్తగా ఆడిన సౌదీ అరేబియా ప్రత్యర్థి జట్టుకు అవకాశం ఇవ్వలేదు.
ప్రత్యర్థి ఆటగాళ్లు పదేపదే గోల్ పోస్టులపై దాడి చేసినా సౌదీ డిఫెన్స్
ఆటగాళ్లు సమర్థంగా అడ్డుకున్నారు. చివరి వరకు ఆధిపత్యాన్ని కాపాడుకుని సంచలన
విజయాన్ని నమోదు చేశారు. కాగా, అర్జెంటీనా తన తర్వాతి మ్యాచ్‌లో ఆదివారం
మెక్సికోతో తలపడుతుంది.