ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్-2022 గ్రూప్ లీగ్ దశ పోటీల్లో
శుక్రవారం మరో సంచలనం చోటు చేసుకుంది. గ్రూప్-బి లీగ్ మ్యాచ్‌లో ఇరాన్
జట్టు 2-0 గోల్స్ తేడాతో వేల్స్‌ను ఓడించింది. ఈ రెండు గోల్స్ ఇంజూరీ
సమయంలోనే నమోదు కావడం మరో విశేషం. రెండు అర్ధభాగాల సమయం ముగిసే సరికి ఇరుజట్లు
0-0తో సమంగా నిలిచాయి. ఇంజూరీ సమయంలో ఇరాన్ తరఫున రుజ్బా చెష్మీ(90+8వ ని.),
రామిన్ రెజ్లాన్(90+11వ ని.) ఒక్కో గోల్ కొట్టారు. దీంతో వేల్స్ జట్టు
అభిమానులు షాక్‌కు గురి కాగా.. ఇరాన్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగారు. ఈ
మ్యాచ్‌లో ఇరాన్ ఆటగాళ్లు 6 సార్లు గోల్ కొట్టేందుకు ప్రయత్నించారు. వేల్స్
టీమ్ నాలుగుసార్లు గోల్ కోసం ప్రయత్నించి విఫలమైంది. ఈ మ్యాచ్‌లో వేల్స్
గోల్ కీపర్ వేనే హెన్నెసే రెడ్ కార్డ్ అందుకున్నాడు. ఈ వరల్డ్ కప్‌లో
రెడ్ కార్డ్ అందుకున్న మొదటి వ్యక్తి అతనే. ఇరాన్ జట్టు తమ మొదటి మ్యాచ్‌లో
ఇంగ్లండ్ చేతిలో 6-2 గోల్స్‌తో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. 30న జరిగే ఆఖరి
లీగ్ మ్యాచ్‌లో ఇరాన్జట్టు అమెరికాను ఓడిస్తే ప్రి క్వార్టర్ ఫైనల్‌కు
చేరనుంది.