వరకు రూ.300 టికెట్ల ఆన్లైన్ కోటాను ఫిబ్రవరి 13న ఉదయం 9 గంటలకు టిటిడి
విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆన్లైన్లో టికెట్లు బుక్
చేసుకోవాలని కోరడమైనది.ఫిబ్రవరి 11న అంగప్రదక్షిణం టోకెన్ల కోటా విడుదల
మార్చి నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాతో పాటు, ఈనెల 23 నుండి
28వ తేదీ వరకు విడుదల చేయని కోటాను ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 11 గంటలకు టిటిడి
ఆన్లైన్లో విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని గుర్తించి ఆన్లైన్లో
టోకెన్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు కోరారు.
20 నుండి 28 వరకు జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో గల టిటిడికి చెందిన శ్రీ వేంకటేశ్వర స్వామివారి
ఆలయంలో ఫిబ్రవరి 20 నుండి 28వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
ఇందుకోసం ఫిబ్రవరి 19న అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా
ఫిబ్రవరి 20న ధ్వజారోహణం, ఫిబ్రవరి 24న గరుడసేవ, ఫిబ్రవరి 27న రథోత్సవం,
ఫిబ్రవరి 28న చక్రస్నానం, మార్చి 1న పుష్పయాగం నిర్వహిస్తారు. ఉదయం 8 నుండి 9
గంటల వరకు, తిరిగి రాత్రి 8 నుండి 9 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు.