టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ఈమధ్యనే “యశోద” సినిమాతో మంచి విజయాన్ని
సాధించింది. తాజాగా ఇప్పుడు టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో
“శాకుంతలం” అనే సినిమాతో సామ్ బిజీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్
పూర్తయింది. ఇక సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా
ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీనీ చిత్ర బృందం అధికారికంగా
ప్రకటించింది. సమంతా, దేవ్ మోహన్‌లను కలిగి ఉన్న చిత్రం నుంచి ఒక పోస్టర్‌ను
సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
కొత్త పోస్టర్‌కి సమంత క్యాప్షన్ కూడా ఇచ్చింది. “ఎ పిక్ లవ్ స్టోరీ
#శాకుంతలం సాక్షిగా ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 17, 2023 నుంచి మీకు సమీపంలోని
థియేటర్లలో! అలాగే 3డిలో.” అంటూ ఇన్ స్టా లో పోస్ట్ చేయడం విశేషం. “శాకుంతలం”
అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. శకుంతల, దుశ్యంతుడి ప్రేమ కథ
ఆధారంగా ఈ సినిమా ఒక మైథలాజికల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. శకుంతల
పాత్రలో సమంత కనిపించనుండగా, దుశ్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్
నటించారు. మోహన్ బాబు దుర్వాస మహర్షిగా ఈ సినిమాలో నటిస్తుండగా, ప్రకాష్ రాజ్,
అదితి బాలన్, అనన్య నాగల్ల, జిషు సేన్ గుప్తా, సచిన్ ఖేడేకర్ తదితరులు కీలక
పాత్రల్లో నటిస్తున్నారు.