కొవ్వూరు : గడప గడపకు మన ప్రభుత్వం లో భాగంగా 68 వ రోజు కొవ్వూరు టౌన్ లోని 17
వ వార్డ్ లో హోంమంత్రి తానేటి వనిత గారు పర్యటించారు. ఒక్కో లబ్ధిదారునికి
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి, సీఎం గారి పరిపాలన గురించి
ఇంటింటికీ తిరిగి వివరించారు. లబ్ధిదారులతో పాటు సామాన్య ప్రజల ఇళ్లకు వెళ్లి
వారి బాగోగులను హోంమంత్రి అడిగి తెలుసుకున్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని
విధంగా లబ్ధిదారులకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం జగన్
కే దక్కుతుందని హోంమంత్రి వనిత స్పష్టంచేశారు. అమ్మవడి, విద్యా కానుక,
వృధ్యాప్య పెన్షన్, రైతు భరోసా, చేయూత, ఇళ్ల స్థలం వంటి అనేక పథకాలను గ్రామ
సచివాలయ సిబ్బంది ద్వారా అందిస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో ప్రజా సమస్యలు
తెలుసుకొని పరిష్కరించేందుకు సీఎం జగన్ తమను పంపించినట్లు హోంమంత్రి
పేర్కొన్నారు. ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని
హోంమంత్రి తానేటి వనిత అధికారులను ఆదేశించారు.