న్యూఢిల్లీ : ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం విచారణ చేపట్టాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనం వద్ద కేసు గురించి ప్రస్తావించారు. దీనిపై స్పందించిన జస్టిస్ అనిరుద్ధ బోస్ ఈరోజు బెంచ్ కూర్చోవడం లేదని తెలిపారు. విచారణకు మరో తేదీ ఇస్తామని వెల్లడించారు. ఫైబర్ నెట్ కేసులోని అంశాలు 17-ఏ సెక్షన్‌తో ముడిపడి ఉన్నందున ధర్మాసనం గతంలో ఈ కేసును వాయిదా వేసింది. అప్పటివరకు చంద్రబాబుపై తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. అయితే మంగళవారం సెక్షన్ 17-ఏపై ధర్మాసనం భిన్న తీర్పులు వెలువరించిన నేపథ్యంలో ఫైబర్‌నెట్ కేసులో ముందస్తు బెయిల్‌పై ఎలాంటి ఉత్తర్వులు వస్తాయన్న అంశంపై ఆసక్తి నెలకొంది.