ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపైనా చర్చ?
న్యూఢిల్లీ : తెలంగాణలో ప్రతిపక్షాల నేతలు, ఇతర ముఖ్య నాయకుల ఫోన్లు ట్యాప్ అవుతున్నా యంటూ అనేక ఫిర్యాదులు వస్తున్నాయని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ప్రభు త్వంలోని కీలక వ్యక్తుల కనుసన్నల్లో ఫోన్ ట్యాపింగ్ జరు గుతోందని, దీనికి పోలీసులు సహకరిస్తు న్నారని వివిధ పార్టీల నేతలు తనకు ఫిర్యాదు చేశారని వివరించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఢిల్లీ పర్యటనకు వచ్చిన గవర్నర్.. సాయంత్రం నార్త్‌బ్లాక్‌లోని హోంశాఖ కార్యాలయంలో అమిత్ షాతో భేటీ అయ్యారు. సుమారు పది నిమిషాల పాటు వారు వివిధ అంశాలపై చర్చించారు. తన మూడేళ్ల పదవీ కాలంలో రాష్ట్రంలో చేపట్టిన కార్యక్రమాలు, తీసుకున్న నిర్ణ యాలకు సంబంధించిన నివేదికను అమిత్‌షాకు తమి ళిసై అందజేశారు.
రాష్ట్రంలో ఇటీ వలి రాజకీయ పరిణా మాలు, ఎమ్మెల్యేల కొను గోలు అంశం, పలు బిల్లుల ఆమోదం విషయంలో ప్రభుత్వ సహ కారం వంటి అంశాలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల కొను గోలు వ్యవహారంలో కేసీఆర్ అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం, కేంద్రంలోని పెద్దలను ఇరకాటంలోకి నెట్టేలా వ్యవహరి స్తున్న తీరుపైనా చర్చ జరిగినట్టు సమాచారం. ఇక తన ఆమోదం కోసం వచ్చిన పలు బిల్లుల విషయంలో అదనపు సమాచారం కోరినా ప్రభుత్వ యంత్రాంగం నుంచి స్పందన కరువైన విషయాన్ని అమిత్‌షా దృష్టికి గవర్నర్ తీసుకెళ్లినట్టు తెలిసింది. విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగాల భర్తీ కోసం కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు బిల్లుపై సందేహాలు ఉన్నాయని, వాటి నివృత్తి కోసం రాష్ట్ర విద్యా మంత్రికి లేఖ రాసినా స్పందన లేదని వివరించినట్టు సమాచారం.
మామూలు భేటీయే : గవర్నర్
అమిత్‌షాతో భేటీ అనంతరం గవర్నర్ తమిళిసై మీడియాతో ముక్తసరిగా మాట్లాడారు. తెలంగాణ గవర్నర్‌గా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర హోంమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశానని తెలిపారు. గవర్నర్‌గా తన మూడో ఏడాదికి సంబంధించిన కార్యకలాపాలను నివేదిక రూపంలో హోంమంత్రికి ఇచ్చానని వివరించారు. కేంద్ర హోంమంత్రితో భేటీ సాధారణంగా జరిగే ప్రక్రియలో భాగమేనని, ఎలాంటి ప్రత్యేకతా లేదని పేర్కొన్నారు.