ఇటీవలి కాలంలో హీరోయిన్ అనుష్క శెట్టి సినిమా ఫంక్షన్లు సహా సోషల్
మీడియాలోనూ పెద్దగా యాక్టివ్‌గా కనిపించడం లేదు. బాహుబలి లాంటి అద్భుతమైన
విజయం తర్వాత ఆమె వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ అవుతుందనుకున్నారు. కానీ, చాలా
రోజులుగా అనుష్క బయట ఎక్కడా కనిపించడం లేదు. అయితే తాజాగా కుటుంబసభ్యులతో
కలిసి బెంగళూరులో శివరాత్రి వేడుకలకు హాజరైంది.దీనికి సంబంధించిన ఫోటోలు
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దాదాపు రెండేళ్ల తర్వాత అనుష్క
బయట కనిపించడంతో ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
నటి అనుష్క శెట్టి ఒక గుడిలో ఉన్న ఫోటోలు వైరల్ అయిన తర్వాత ఆమె
ట్రెండింగ్‌లో నిలిచింది. మహా శివరాత్రి పూజలో తెల్లటి దుస్తులు ధరించి.. చాలా
బొద్దుగా కనిపించడంతో అభిమానులు షాక్ కు గురయ్యారు. కాగా,ఇందులో అనుష్క
కాస్త బొద్దుగా కనిపిస్తున్నారు. ఇక కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె
నవీన్ పొలిశెట్టికి జోడీగా ‘మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’ అనే సినిమాలో
నటిస్తున్నారు.యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
ఇటీవలి కాలంలో అనేక మంది మహిళా తారలు బాడీ-షేమ్‌గా వ్యవహరించారు. రవీనా
టాండన్ ఇటీవల 90వ దశకంలో ప్రముఖ తారగా ఉన్నప్పుడు “థండర్ తొడలు” అని పిలువడం
గురించి మాట్లాడింది.
అధేవిధంగా నటి విద్యాబాలన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… “నా బరువు
సమస్య జాతీయ సమస్యగా మారింది. నేను ఎప్పుడూ లావుగా ఉండే అమ్మాయినే; నా బరువు
హెచ్చుతగ్గులు నన్ను ఇబ్బంది పెట్టని దశలో ఉన్నానని నేను చెప్పను. కానీ నేను
చాలా దూరం వచ్చాను.” అని చెప్పింది.