రెడ్ కార్పెట్ స్వాగతం.. ప్రవాస భారతీయులతో ముచ్చట్లు!
రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా గురువారం పారిస్ చేరుకున్న భారత ప్రధాని
నరేంద్ర మోదీకి.. రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. ఆయన శుక్రవారం జరిగే
ఫ్రాన్స్ జాతీయ దినోత్సవ వేడుకలకు హాజరుకానున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు
ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఆహ్వానం మేరకు రెండు రోజుల పర్యటన నిమిత్తం.. ఆ దేశం
వెళ్లిన ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ఫ్రాన్స్ ప్రధాని ఎలిసబెత్
బోర్న్ పారిస్ విమానాశ్రయానికి వెళ్లి మోదీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా
ఫ్రాన్స్ దళాలు మోదీకి గౌరవ వందనం సమర్పించాయి. ఇరు దేశాల జాతీయ గీతాన్ని
ఆలపించారు.