ఫ్రాన్స్ బాస్టిల్ డే పరేడ్‌లో ముఖ్య అతిథిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ
పాల్గొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో కలిసి మోదీ
బాస్టిల్ డే పరేడ్‌ను వీక్షించారు. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవాన్ని
పురస్కరించుకుని అట్టహాసంగా నిర్వహించిన బాస్టిల్ డే పరేడ్‌లో ముఖ్య అతిథిగా
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు
ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో కలిసి నరేంద్ర మోడీ పరేడ్‌ను వీక్షించారు.
ఐరోపాలోనే అతిపెద్ద కవాతుగా పేరున్న బాస్టిల్ డే పరేడ్‌లో భారత సైనికులు
పాల్గొన్నారు. భారత సాయుధ దళాలకు చెందిన 269 మంది ఫ్రాన్స్ దళాలతో కలిసి
పరేడ్ చేశారు. భారత్‌కు చెందిన 4 రఫేల్ విమానాలు, 2 సీ-17 గ్లోబ్‌మాస్టర్లు
పారిస్ గగనతలంలో విన్యాసాలు నిర్వహించాయి.